విజయ్ దేవరకొండ మామూలోడు కాదు..అందరికీ షాక్

విజయ్ దేవరకొండ మామూలోడు కాదు..అందరికీ షాక్

తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో విజయ్ దేవరకొండకు తెలిసినట్లుగా ఇంకెవరెకీ తెలియదనిపిస్తుంది. తన కొత్త ఆలోచనలతో సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ తీసుకువస్తూంటారు. ఆ విషయం మనకు గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ చేస్తున్న డియర్ కామ్రేడ్ ప్రమోషన్ చూస్తే స్పష్టంగా అర్దమవుతుంది. ఈ సినిమాని చాలా ఎగ్రిసెవ్ గా ప్రమోట్ చేస్తున్నారు. మ్యూజిక్ కాన్సర్ట్ లు ద్వారా ఈ సినిమా హైప్ బిల్డ్ చేసారు. అయితే అదే సమయంలో ఆయన ముంబై వెళ్లారు. అయితే ఆ విషయం ఎవరికీ తెలియలేదు. అక్కడ బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ , డిస్ట్రిబ్యూటర్ అయిన కరణ్ జోహార్ ని కలిసారు. ఆయనకు స్పెషల్ స్క్రీనింగ్ వేయించారు.

దాంతో రిలీజ్ కు ముందే డియర్ కామ్రేడ్ సినిమా షో చూసిన కరణ్ జోహర్ చాలా ఇంప్రెస్ అయ్యిపోయారు. ముఖ్యంగా లీడ్ యాక్టర్స్ ఫెరఫార్మెన్స్ ఆయనకు తెగ నచ్చేసింది. ఆ విషయాలను చెప్తూ సోషల్ మీడియాలో రివ్యూలాంటి ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. అదే విజయ్ దేవరకొండకు కావాల్సింది. రిలీజ్ కు ముందు ఓ చిన్న కుదుపు. మీడియా మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుతోంది.

హిందీలో కరణ్ జోహార్ రీమేక్ చేయబోతున్నారనేది హెడ్ లైన్స్ లో వార్త అయ్యింది. అయితే కరణ్ జోహార్ సినిమా హిట్టయ్యాక చేయచ్చు. లేదా మానుకోవచ్చు. అది వేరే విషయం. అయితే ఈ రోజు కు మాత్రం డియర్ కామ్రేడ్ కి మాత్రం నేషనల్ స్దాయిలో పబ్లిసిటీ. జాతీయ మీడియా సైతం ఈ సినిమా గురించి మాట్లాడుతోంది. అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. ఇది చూసిన టాలీవుడ్ జనం..విజయ్ దేవరకొండ స్ట్రాటజీలకు ముక్కున వేలేసుకుంటున్నారు.