పాపం కాజల్!
అందాలతార కాజల్ అగర్వాల్ చిత్రసీమ కొచ్చి అప్పుడే 12 ఏళ్ళు గడచి పోయాయి. అయితే, ఇన్నేళ్ళు గడచినా తిరిగి వెనక్కి చూసుకుంటే కెరీర్ లో సాధించిందేమీ కనిపించడం లేదట.
తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు చేస్తున్నా, కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందట. ఇలా వచ్చి అలా వెళ్ళి పోతున్న సాటి కథానాయికలను చూస్తుంటే వాళ్ళు సాధించిన దాంట్లో తను సాధించిందేమిటీ? అని బేరీజు వేసుకుంటుందిట!
స్పీడ్ గా సినిమాలకు సైన్ చేసి కెరీర్ లో పెద్ద తప్పులు చేశానని తెగ బాధపడి పోతుందట. అలా బాధ పడిపోతూ కూడా మళ్ళీ సినిమాలను ఒప్పుకోవడంలో అదే స్పీడ్ ను కొనసాగిస్తుందట.
ఈ ఏడు గడచిన 6 నెలల్లో ఆమె నడిచిన సీత అనే ఓ సినిమా విడుదలైంది. రణరంగం చిత్రంతో పాటుఏ కోమలే అనే తమిళ చిత్రం పూర్తయ్యాయి. తాజాగా మరో రెండు కొత్త చిత్రాలకు సైన్ చేసిందట. అది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కనుందట! ఇందులో విష్ణు హీరోనట. పాపం.. కాజల్!