“ఫలక్‌నుమాదాస్” దర్శకుడు , హీరో విశ్వక్ సేన్ నిన్నటి నుంచి వార్తల్లో నిలిచాడు. విజయ్ దేవరకొండ అభిమానులు ఈ యువ హీరోని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారంటూ ఇష్యూ చేసాడు. ఇద్దరూ తెలంగాణా కు చెందిన హీరోలు కావటం వల్ల వీరిద్దరి మధ్యా విభేధాలు ఉన్నట్లు బేహేవ్ చేసాడు .
అయితే విజయ్ దేవరకొండలా యాటిట్యూడ్ తో మాట్లాడం వల్లనో, ఆడియో ఫంక్షన్‌లో బూతు పదం వాడడం వల్లో విజయ్ దేవరకొండ కాలేరు అని కొందరు విమర్శించారు. ఇదంతా “ఫలక్‌నుమాదాస్” సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత జరిగింది. “ఫలక్‌నుమా దాస్” సినిమా పెయిడ్ ప్రీవ్యూస్ చూసిన వెంటనే సోషల్ మీడియాలో చాలా మంది ఇదే కామెంట్ చేశారు. సినిమా ఎవరకీ నచ్చకపోవటంతో ఈ విధంగా కామెంట్స్ వచ్చాయని భావించారు.
కానీ దీని వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడేమో అన్నట్లుగా విశ్వక్‌సేన్ మాట్లాడటం అందరికి షాక్ ఇచ్చింది. తనని తిట్టిన వాళ్లందర్నీ “దె…* అంటూ బూతుపదం వాడడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే వీటిన్నటివెనక వేరే ఏమీ లేదని కేవలం సినిమాకు పబ్లిసిటీ కావాలని పక్కా పబ్లిసిటీ స్కెచ్ తోనే ఈ కామెంట్స్ అని అంతటా వినిపిస్తున్నాయి. ఇదంతా విశ్వక్ సేన్ వేసిన చీప్ పబ్లిసిటీ ట్రిక్ తప్ప మేరేదీ కాదంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే సోమవారం హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు. వరుసగా రెండు రోజులు నిద్రలేకపోవడం వల్ల అలా చేశానన్నట్లుగా అర్దంపర్దం లేని వివరణ ఇచ్చాడు.