ఒకప్పుడు రవితేజ సినిమాలు అంటే మినిమం గ్యారెంటీగా ఉండేవి. దాంతో ఆయన తో సినిమా చెయ్యాలన్నా, ఆయన సినిమాలు డిస్ట్రిబ్యూట్ చెయ్యాలన్నా పెద్ద క్యూ ఉండేది. అయితే వరస ఫ్లాఫ్ లు ఆ సీన్ ను రివర్స్ చేసేసాయి. రవితేజ మాస్ మసాలా సినిమాలని జనం తిప్పి కొడుతున్నారు. అదే మ్యానరిజం..అదే పగ, ప్రతీకారం మార్క్ కథలు అంటే విసుగెత్తిపోయారు. కొత్తదనం కోరుకుంటున్న జనాలకు ఆయన పాత చింతకాయపచ్చడిలా కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయనతో సినిమా చెయ్యాలంటేనే నిర్మాతలు దూరం జరుగుతున్నారు.
ఈ విషయం గమనించిన రవితేజ…కథల్లో నవ్యత ఉండేలా చూసుకోవటమే కాక, రెమ్యునేషన్ ను కూడా తగ్గించుకుని నిర్మాతలకు కొంత భారం తగ్గించాలని ఫిక్స్ అయ్యాడట. అంతకు ముందు పది కోట్ల వరకూ రెమ్యునేషన్ డిమాండ్ చేసి తీసుకునే ఆయన ఇప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించేసాడట. దాంతో ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాత రిలీఫ్ ఫీలయ్యారట.
ఇక రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశ పరుస్తూ ఉండడంతో తన కొత్త సినిమా విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకొదలుచుకోలేదట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడు వీఐ ఆనంద్ కు సూచించాడట. దీంతో రవితేజ సూచించిన మార్పుచేర్పులను చేసే పనిలో వీఐ ఆనంద్ బిజీగా ఉన్నాడట. ఆ పని పూర్తికాగానే షూటింగ్ కు వెళ్లిపోతారు.