గత కొద్ది రోజులుగా మంచు కుటుంబ విద్యా సంస్ద శ్రీ విద్యానికేతన్ ఫీజ్ రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, నటుడు మోహన్ బాబుకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. సమయంలో మోహన్ బాబు మిత్రుడు రామ్ గోపాల్ వర్మ..కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీసి రిలీజ్ కు రెడీ చేసారు. తమ సినిమా రిలీజ్ కు తెలుగుదేశం పార్టీ వారు పెడుతున్న అడ్డంకులపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపధ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మోహన్ బాబును కలవడం సినీ,రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుని ఉంటారు అంటే చాలా మంది..చంద్రబాబుని ఇద్దరు కలిసి తిట్టుకుని ఉంటారు అని తేల్చేసారు. అయితే మోహన్ బాబు వేరొకరని తిట్టడానికి పనిగట్టుకుని వర్మని కలవరు. అలాగే వర్మ కూడా అంత ఖాళీగా లేరు. మరి మోహన్ బాబు స్పెషల్ ఇంట్రస్ట్ ఏమిటి…అంటే వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ లో తన పాత్ర గురించి గురించి తెలుసుకుని, తేడాగా ఉంటే కనుక ఆ సీన్స్, డైలాగులు తొలిగించమని అడగటానికి అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
ఇక మోహన్ బాబు రిక్వెస్ట్ ని వర్మ ఓకే చేసారా…అనేది సినిమా రిలీజ్ దాకా సస్పెన్సే కానీ, నిజానికి మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సీన్స్ ఏమీ సినిమాలో పెట్టలేదు అని వినపడుతోంది. జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయటానికి మోహన్ బాబుని సీన్ లోకి తెచ్చి ప్రోమోలలో, ఫొటోలలో వదిలాడు కానీ నిజానికి సినిమాలో అంత సీన్ ఉండదని చెప్తున్నారు.