ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ మాస్ “సలార్” పై ఆ గాసిప్స్ నిజమేనట.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పలు సినిమాల మార్కెట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి అలాంటి చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ప్రతిదీ కూడా సెన్సేషన్ అని చెప్పాలి. అయితే ఈ చిత్రాల్లో కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ ఏక్షన్ డ్రామా “సలార్” కూడా ఒకటి.

ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా ఓ రేంజ్ లో సెన్సేషన్ ని రేపుతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై గత కొన్నాళ్ల కితం కేజీఎఫ్ తరహాలోనే రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నట్టు క్రేజీ టాక్ మరియు గాసిప్పులు కొన్ని వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ ప్రకారం ఖచ్చితంగా ఈ మాట నిజమే అని తెలుస్తుంది. దీనితో ఈ సినిమా కూడా ఓ ఫ్రాంచైజ్ లా రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ పైనే 1000 కోట్ల రేంజ్ టాక్ నడుస్తుంది.

ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా సెన్సేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే భారీ బడ్జెట్ తో కేజీఎఫ్ నిర్మాతలే ఈ సినిమాని కూడా నిర్మాణం వహిస్తున్నారు.