ఇన్సైడ్ టాక్ : “NBK107” రిలీజ్ మార్పులపై లేటెస్ట్ సమాచారం మీకోసం.!

నందమూరి నటసింహ బాలకృష్ణ తన లాస్ట్ హిట్ “అఖండ” తో టాలీవుడ్ లో మరో భారీ హిట్ ని అయితే తాను అందుకోగా ఇక్కడ నుంచి తన సినిమాలపై మరిన్ని అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఇక వాటికీ తగ్గట్టే బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ 107వ సినిమా అలాగే నెక్స్ట్ దర్శకుడు అనీల్ రావిపూడితో 108వ సినిమాలు ప్లాన్ చేసుకున్నారు.

వీటిపై కూడా మంచి అంచనాలు అయితే నెలకొనగా ఇప్పుడు బాలయ్య 107 సినిమాపై ఇంట్రెస్టింగ్ సమాచారం సినీ వర్గాల నుంచి తెలుస్తుంది. చిత్ర యూనిట్ నిజానికి ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ ప్లాన్ చేశారు. బహుశా అఖండ రిలీజ్ డేట్ డిసెంబర్ 2నే రిలీజ్ చేసి హిట్ కొట్టాలని ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు టాక్ ఏమిటంటే ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేయాలని చూస్తున్నారట. బహుశా సంక్రాంతి బరిలో నిలిపే ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అయితే సినిమా రిలీజ్ కాస్త ముందు కానీ లేదా వెనక్కి గాని వెళ్లే ఛాన్స్ ఉందని ఇన్సైడ్ టాక్.

ఆల్రెడీ సినిమా షూటింగ్ అంతా అయిపోవచ్చింది. సో ఈ ఏడాదిలో ఉండే ఛాన్సెస్ ఎక్కవ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం ఇస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.