సక్సెస్ ఇచ్చే కిక్కు వేరు. అది లేనిదే అసలు జీవితానికి ఇంకేదీ లేనట్టే. ఏదో నీరసం ఆవహించినట్టు ఉంటుంది. పైగా ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించనలవి కాదు. అలాంటి నైరాశ్యంలోనే కొట్టుమిట్టాడింది సదరు సెక్సీ హీరోయిన్ కం నిర్మాత. పెద్ద హిట్లు కొడితే కోట్లు కొల్లగొట్టొచ్చన్న నమ్మకంతో ఆరంభం తన వద్ద ఉన్న సొమ్ములన్నీ కుమ్మరించి సినిమాలు నిర్మించింది. పైగా కమర్షియల్ సినిమాలు తీసే మాస్ డైరెక్టర్ తో చెలిమి చేసి కచ్ఛితంగా అతడి వల్ల కోట్లకు పడగలెత్తొచ్చని బలంగా నమ్మిందట. అందుకే తన వద్ద ఉన్న సొమ్ములన్నీ తెచ్చి అవసరం అనుకుంటే ఫైనాన్సులు తెచ్చి ఫుల్లుగానే పెట్టుబడులు పెట్టింది. కానీ ఊహించని ఫ్లాపులు సదరు హీరోయిన్ ని తీవ్రంగా క్రైసిస్ లోకి నెట్టేశాయి. అయితే ఎన్ని పరాజయాలు వచ్చినా.. అతడినే నమ్మి మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టినందుకు ఇన్నాళ్టికి ఫలితం దక్కింది. అదిరిపోయే బ్లాక్ బస్టర్ తగిలింది.
ఈ దెబ్బకు అప్పులన్నీ తీరిపోయాయ్. పైగా ఖాతాలోకి కట్టలు తెంచుకున్న వరదలా ఫుల్లుగా కరెన్సీ వచ్చి చేరిందట. ఆ కరెన్సీ వాసన తగలగానే మత్తెక్కిపోతోందట. ఇక ఈ ఆనందంలోనే మందేసి చిందేసి రేతిరంతా పార్టీలు పబ్బులు అంటూ బోలెడంత జాగారం చేస్తోంది. వయసు 40కి చేరుతున్నా సదరు ఛార్మింగ్ బ్యూటీ ఇంకా టీనేజ్ గాళ్ లా చెలరేగిపోతోందట. అప్పుడప్పుడు ఆ ఆనందాన్ని దాచుకోలేక గ్లాస్ లోకి మందు ఒలకబోస్తూ మత్తెక్కిపోతున్న ఫోటోలు వెబ్‌లో లీకులిస్తోంది. ఈ దఫా ఈ హిట్టు వల్ల సుమారు 10 కోట్లు వరకూ లాభాలు రావడంతో అసలు ఇలాంటి హిట్టును ఎలా ఎంజాయ్ చేయాలో కూడా అర్థం కావడం లేదట. ఇక ఇదే ఉత్సాహంలో ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోల్ని వల వేసి ఒడిసిపడుతోందని తెలుస్తోంది. అంతేకాదు ఫ్లాపుల్లో ఉన్న తమను కాదనుకున్న హీరోలకు మునుముందు సవాల్ విసిరే ప్లాన్ లోనూ ఉన్నారట. కోలీవుడ్ బాలీవుడ్ టై అప్ లతోనూ భారీ చిత్రాలు తీయాలన్న ఆలోచనలోనూ మ్యాడమ్ ఉన్నారు. అగ్ర హీరోలను ఏదోలా లైన్ లో పెట్టి పెద్ద రేంజులో దీపం ఉండగానే చక్కబెట్టే ప్లాన్ లో ఉన్నారట. ఆవిడగారి ప్లాన్ తెలిసిన వాళ్లంతా వామ్మో వాయ్యో అంటూ గిలగిలా కొట్టుకుంటున్నారని ఫిలింనగర్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయ్!!

