గాసిప్స్ : చరణ్ హాలీవుడ్ లెవెల్ సినిమా ఆగిపోయిందా? అందుకే మరో ప్లాన్.?

టాలీవుడ్ మెగా హీరో అలాగే నెక్స్ట్ మెగా స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు సెన్సేషనల్ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ చరణ్ జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో ఓ భారీ సినిమా లాక్ చేసాడు.

అయితే ఈ అవైటెడ్ సినిమా ఏకంగా ఇంటెర్నేషల్ లెవెల్ స్టాండర్డ్స్ తో ప్లాన్ చేసినట్టుగా టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటూ జస్ట్ వారం పది రోజులు కితమే పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి కానీ అదేమీ లేదని మెగా వర్గాలు చెప్పాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఈ సినిమా ఆగిపోయింది అనే గాసిప్స్ గట్టిగా మొదలయ్యాయి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా పలు కారణాలతో నిలిచిపోయింది అని అందుకే ఈ సినిమా ప్లేస్ లో రామ్ చరణ్ ఇంకో దర్శకునితో సినిమా ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు.

ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రూమర్స్ కన్నడ దర్శకుడు నర్తన్ తో చరణ్ సినిమా చేయబోతున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. మరి బహుశా ఇది చరణ్ 16వ సినిమానేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మళ్ళీ రామ్ చరణ్ లైనప్ పై మాత్రం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది.