గాసిప్స్ : రామ్ చరణ్ తో మరోసారి పూజా హెగ్డే చేయబోతుందా..?

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన క్రేజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తున్న తాను తన లైనప్ లో అయితే మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడ్డట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు దర్శకుడు శంకర్ తన కెరీర్ లో 15వ సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత 16వ సినిమాగా దర్శకుడు గౌతమ్ తిన్ననురితో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే ఈ చిత్రం ఇంకా కన్ఫర్మ్ గా ఆగిపోయిందో లేదో కానీ మెగాపవర్ స్టార్ తో కన్నడ దర్శకుడు నర్తన్ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మరి ఈ సినిమా కోసం మళ్ళీ మరో క్రేజీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఓకే అయ్యిందో లేదో కూడా తెలియని ఈ చిత్రంలో ఆల్రెడీ హీరోయిన్ కూడా లాక్ అయ్యినట్టుగా అంటున్నారు. మరి ఆమె ఎవరో కూడా కాదు డస్కీ బ్యూటీ పూజా హెగ్డే అంట. ఆల్రెడీ వీరి జంట నుంచి ఆచార్య వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.