వక్కంతం వంశీ నెక్ట్స్ డైరక్ట్ చేయబోయే హీరో ఎవరంటే…

వక్కంతం వంశీ తెలుగులో వరసపెట్టి హిట్ కథలు అందించిన రచయిత. అశోక్, కిక్, రేసుగుర్రం, టెంపర్ ఈ చిత్రాల విజయం వంశీ కథలతోనే సాధ్యమైందనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తన తోటి రచయితలు మాదిరిగా ఆయన కూడా డైరక్షన్ వైపుకు రావాలని భావించారు. అల్లు అర్జున్ డేట్స్ పట్టుకుని నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా అంటూ ఓ చిత్రం డైరక్ట్ చేసారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆ సినిమా డిజాస్టర్ అవటంతో వంశీ కథలు తీసుకునేవాళ్లు సైతం కరవు అయ్యారు.

అలాగే వంశీ సైతం తన నెక్ట్స్ ప్రాజెక్టు డైరక్షన్ కోసం ట్రై చేస్తున్నారు కానీ కథలు అమ్మే దిశగా దృష్టిపెట్టలేదు. అయితే ఒక సినిమాతోనే అతనిలో స్టఫ్ లేదని, డైరక్టర్ గా పనికిరాలేడని అంచనా వెయ్యలేం కదా. అలాగని రిస్క్ చేసే హీరో మాత్రం ఎవరు ఉంటారు. సినిమా హిట్ అయ్యితే వెంటనే ఎన్టీఆర్ డేట్స్ దొరికేవి. ఎందుకంటే ఎన్టీఆర్ కు, వక్కంతం కు ఉన్న స్నేహం అలాంటింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ కావటంతో ఓ స్క్రిప్టు రాసుకుని నాని ని ఎప్రోచ్ అయ్యాడట.

నానికి వంశీ చెప్పిన పాయింట్ ఎలా ఉన్నా, దాన్ని కమర్షియల్ గా ట్రీట్ చేసిన విధానం నచ్చిందట. దాంతో ఫుల్ స్క్రిప్టుతో వస్తే పట్టాలు ఎక్కించేద్దాం అన్నాడట. ప్రస్తుతం వక్కంతం అదే పనిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అన్ని కలిసి వస్తే త్వరలోనే ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తారు.