పాపం డైరక్టర్ శంక‌ర్‌ కి ఎంత కష్టం, దుస్దితి?

పాపం డైరక్టర్ శంక‌ర్‌ కి ఎంత కష్టం, దుస్దితి?

తమిళ దర్శకుడు శంకర్ అంటే ఒకప్పుడు ఓ రేంజి క్రేజ్. వరస హిట్స్. ఆయన తో చేయాలని ప్రతీ హీరో కల. ఆ పరిస్దితి నుంచి ఇప్పుడు తన రెమ్యునేషన్ సైతం వదులుకుని సినిమా పట్టాలు ఎక్కించాల్సిన పరిస్దితి. తనతో సినిమాలు చేసేందుకు హీరోలు దొరకని సిట్యువేషన్. ఈ పరిస్దితి శంకర్ కాదు కదా మరెవరూ ఊహించి ఉండరు. కాని ఇది నిజం అంటున్నాయి తమిళ వర్గాలు. ఆ డిటేల్స్ ఏంటో చూద్దాం..

ఆ మధ్యన ఎంతో ప్రతిష్టాత్మకంగా కమల్ తో ప్రారంభించిన “భార‌తీయుడు 2” సినిమా ఆగిపోయింది. జనవరిలో 15 రోజులు షూటింగ్ చేసి ఆపేసారు. రకరకాల కారణాలు చెప్పుకున్నా అసలు నిజం…బ‌డ్జెట్ ఎక్కువ అవుతోంద‌ని నిర్మాత‌లు సినిమాని పక్కన పెట్టడమే. రోబో 2 అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటమే. ఈ గ్యాప్ లో డైరక్టర్ గా శంకర్ ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసినా, ఏదీ ముందుకు వర్కౌట్ కాలేదు. కమల్ సైతం ఈ సినిమాని పూర్తి చేద్దామనున్నాడు కానీ ఆయన వల్ల కాదని నమస్కారం పెట్టేసాడు. దాంతో ఇక నా వల్ల కాదని ఈ సినిమాని పక్కన పెట్టి వేరే మూవీ చేద్దామనుకున్నారు.

అయితే శంకర్ ఖాళీగా ఉన్నాడని ఇప్పటికిపుడు హీరోలంతా తాము చేస్తున్న సినిమాలు ఆపరి పరుగెత్తుకు రారు కదా..దాంతో మ‌రొ సినిమా చేసేందుకు శంక‌ర్‌కి హీరోలు ఎవ‌రూ దొర‌క‌లేదు. దాంతో వేరే ఆప్షన్ లేక భార‌తీయుడు 2 నిర్మాత‌ల‌ను ఒప్పించి… త‌న రెమ్యునేషన్ స‌గం త‌గ్గించుకున్నాడు. ఈ మిగిలిన స‌గం కూడా సినిమా విడుద‌లై హిట్టైన త‌ర్వాతే ఇవ్వండి అని ఎగ్రిమెంట్ రాసాడు. ఇలా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్దితి శంక‌ర్‌కు రావటం అనేది ఎవరూ ఊహించలేదు. ఓ రకంగా ఇది శంకర్ కు దుస్దితే అంటున్నారు. ఆయన సినిమాలు హిట్టైనా ..రెవిన్యూ పరంగా ప్లాఫ్ కావటమే కారణమని చెప్తున్నారు.