రామ్ చరణ్ బిహేవియర్ పై బోయపాటి మండిపాటు!?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వినయ విధేయ రామ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ్యూస‌ర్ దాన‌య్య నిర్మిస్తున్నఈ చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్ రీసెంట్ గానే జరుపుకుంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ సైతం విడుదలై మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాపై కొన్ని గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం…రామ్ చరణ్ కు, దర్శకుడు బోయపాటి శ్రీను మధ్య టెర్మ్స్ సరిగా లేవుట. ముఖ్యంగా రామ్ చరణ్ బిహేవియర్ కు రామ్ చరణ్ కు మండుకొస్తోంది. తనను చాలా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఫీలవుతున్నారట. తన సినిమా షూటింగ్ లో పాల్గొంటూ …ప్రాజెక్టుపై కాన్సర్టేట్ చేయకుండా తన తండ్రి సైరా చిత్రం ప్రొడక్షన్ ఏక్టివిటీస్ లో బిజీగా ఉంటున్నాడని ఆయన కంప్లైంట్ అంటున్నారు.

అలాగే…ఎన్టీఆర్ తో రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా పెడుతున్న శ్రద్ద తన సినిమాపై పెట్టడం లేదని ఫీలవుతున్నారట. దాంతో తన సినిమా షూటింగ్ కు సైతం సరిగా హాజరు కావటంలేదని, రెండు పాటలు తీసేయాల్సివస్తోందని బాధపడుతున్నారట. మిగతా దర్శకులకు ఇచ్చిన ప్రయారిటీ తనకు ఇవ్వటం లేదని, తనను ప్రక్కన పెట్టేసాడని వాపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందనేది రేపు సినిమా రిలీజ్ అయ్యాక తెరపై అవుట్ ఫుట్ ని చూసాక అర్దమవుతుంది.