వరణ్ తేజ్ ఈ సారి ఇంకో సీనియర్ హీరోతో…

వరుణ్ తేజ్ సోలో హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతరిక్షం’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అయ్యింది. ఏదో సాదా సీదా కామెడీ సినిమా అనుకున్నది దుమ్ము రేపింది. దాంతో వరుణ్ తేజ్ కు ఎనర్జీ వచ్చింది. ఈ సినిమా హిట్ లో సగ భాగం వెంకటేష్ కు పోయినా హ్యాపీ అనిపించింది. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈసారి కూడా మరో సీనియర్ హీరోని తనతో కలుపుకున్నాడు. అతను అర్జున్.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక బాక్సర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ మెగా హీరో. అలాగే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కు బాక్సింగ్ నేర్పించే కోచ్ గా అర్జున్ కనపడనున్నారని తెలుస్తోంది.

ఈ మధ్యనే అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా లో బన్నీ తండ్రిగా నటించిన అర్జున్ ఇప్పుడు మెగా హీరోకు కోచ్ గా మారతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ మరియు అల్లు బాబీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే..వరుణ్ తేజ …సీనియర్ హీరోలను వదలడు.