వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని … ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంకల్ప్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్,పాటలు అన్నీ కూడా సినిమా పై క్రేజ్ పెంచాయి.
బిజినెస్ కూడా బాగా జరిగిందని వార్తలు వచ్చాయి. అంతాబాగానే ఉంది కానీ ఈ చిత్రానికి కావాల్సిన స్దాయిలో ప్రమోషన్స్ మాత్రం చేయటం లేదు. ఇప్పటికి రూరల్ ఏరియాల్లో ఈ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. అసలు ఈ సినిమా దేనికి సంభందించింది అనే విషయపై చాలా మందికి క్లారిటి లేదు.
అందుకు కారణం ఇప్పటివరకూ వరుణ్ తేజ్ ప్రమోషన్ లో పాల్గొనకపోవటం, నిర్మాతలు సైతం ప్రమోషన్స్ పై పెద్దగా శ్రద్ద పెట్టకపోవటం. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దాం అనే ఆలోచన ఇప్పటిదాకా జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయలేకపోయారు. రిలీజ్ చూస్తే ఇంకా మూడు రోజులే ఉంది. కానీ ఇప్పటిదాకా ప్రమోషన్స్ సరిగ్గా స్టార్ట్ కాలేదు. ముఖ్యంగా సినిమా వెరైటి కాన్సెప్టు, కానీ అంతే వెరైటీగా ప్రమోషన్స్ చేస్తారని అందరూ భావించారు.
కానీ సినిమా రిలీజ్ అయ్యాక ..టాక్ దానంతట అదే వస్తుంది కదా అని భావించారో ఏమో కానీ వదిలేసారు. ఆ చిత్రానికి నిర్మాత అయిన దర్శకుడు క్రిష్ డైరక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు మాత్రం ఓ రేంజిలో పబ్లిసిటీ ఉంది. రోజుకో పోస్టర్, పాట అన్నట్లు క్యూరియాసిటీ కలగ చేస్తూనే ఉంది. మరి ఈ అంతరిక్షానికి ఇంత శిక్ష ఎందుకు వేస్తున్నారో మరి.
చిత్రం విషయానికి స్తే..
జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్‌లో ఈ అంతరిక్షం సినిమాను చిత్రీకరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విభాగం పని చేశారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అంతరిక్షం చిత్రానికి అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవనున్నాయి.
హీరో వరుణ్ తేజ్ తో పాటు పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ కోసం.. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధపడినట్లుగా సమాచారం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.