2018: ‘బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయిర్’ ఈ సినిమాయేనా?

2018 బై చెప్పేస్తూ…2019లోకి వెళ్లిపోతోంది. ఈ నేపధ్యంలో సినిమా వాళ్ళు, పనిలో పనిగా మీడియావాళ్లు ఆ సంవత్సరం హైలెట్స్, మైనస్ లు లెక్కేస్తారు. అలాగే బ్లాక్ బస్టర్ సినిమా ఆఫ్ ది ఇయర్ ఏంటనేది కూడా చర్చలోకి వస్తుంది. ఆ చర్చలో తేలిన విషయం ఏమిటీ అంటే… ఈ సంవత్సరం కలెక్షన్స్ వైజ్ గా రంగస్దలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అయితే అదే సమయంలో పెట్టిన పెట్టుబడిని …ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఎంచుతూ అంతనా వేస్తే గీతా గోవిందం చిత్రం మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ గా లెక్క తేలింది. గీతా గోవిదం చిత్రం రిలీజ్ అయ్యాక వచ్చిన టాక్ చూసి పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్లు దాకా వస్తుందని అంచనా వేసారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ… షేర్ 70 కోట్లు వచ్చింది.

ఇలాంటి హిట్ లు దర్శకుడు హీరోకు మధ్య వేవ్‌లెంగ్త్‌ కుదిరితేనే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా దర్శకుడు పరశురామ్‌కి, విజయ్ దేవరకొండ కు మంచి అనుబంధం కుదిరింది. దానికి తోడు గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ కూడా పరుశురామ్ ని బాగా నమ్మారు. అందుకే ‘శ్రీరస్తు–శుభమస్తు’ తర్వాత మళ్లీ ఇదే సంస్థలో ‘గీత గోవిందం’ సినిమాకు దర్శకత్వం వహించారు పరశురామ్‌.ఇవన్నీ కలిసి..‘గీత గోవిందం’ 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చాయి.