మెగా బ్రదర్ నాగబాబు జనసేన, రోజా అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ చదరంగంలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విరోధం వుంది. అయితే ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలైన నాగబాబు, రోజా `జబర్దస్త్` షోతో బుల్లితెరపై ఒకే వేదికని పంచుకుంటూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కామెడీ బ్యాచ్ స్కిట్‌లని ఎంజాయ్ చేస్తూ ఏడేళ్లు గా తమపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా జబర్దస్త్ షో పాపులారిటీని పెంచేశారు.
షోలోని స్కిట్‌లు ఆకట్టుకోవడంతో పబ్లిక్ డిమాండ్ మేరకు ఒక రోజు మాత్రమే ప్రసారం చేసే షోని వారానికి రెండు రోజులు ప్రసారం అయ్యేలా చేశారు. దీంతో షో క్రేజ్ మరింత పెరిగింది. ఉన్నట్టుండి ఈ షో మంచి రైజింగ్‌లో వుండగానే మెగా బ్రదర్ నాగబాబు బయటికి వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లిపోయారు? ఏం జరిగింది? అని అంతా ఆరాతీశారు. షో క్రేజ్ పెరిగినా రెమ్యునరేషన్ పెంచడం లేదన్న కారణంగానే నాగబాబు ఈ షో నుంచి తప్పుకుని వేరే కుంపటి (అదిరింది ) పెట్టుకున్నారని ప్రచారం జరిగింది. `అదిరింది` ప్రోమో లోనూ ఎంత మంది వున్నారన్నది కాదు ఎవడు వున్నారన్నదే ముఖ్యం` అని తన వల్లే ఆ షోకు అంత పాపులారిటీ వచ్చిందని ఇండైరెక్ట్‌గా సంకేతాలిచ్చారు.
అయితే ఆయన స్థానంలో మరొకరిని జడ్జిగా తీసుకోవాలని జబర్దస్త్ మేకర్స్ సీనియర్ నరేష్ నుంచి బండ్ల గణేష్ వరకు ఇలా చాలా మందినే పరిశీలించారట. చివరికి రోజా సలహా మేరకు పోసాని కృష్ణమురళిని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇక్కడే బుల్లితెరపై ఏపీ రాజకీయం మొదలైందని అంటున్నారు. పోసాని వైఎస్సార్సీపీకి సానుభూతిపరుడు. ఆ కారణంగానే రోజా పోసానిని లైన్‌లోకి తీసుకొచ్చిందని ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. దీనిపై రోజా ఏమని కౌంటర్ ఇస్తారో చూడాలి.
Jabardasth is popular telugu show which has huge following. After Naga babu left Jabardasth, Roja influenced the makers to get Posani as other Judge
