పూజహెగ్డే కు హీరోల భజన మరీ ఎక్కువైంది!

ఏ హీరోతో ప్రాజెక్టు చేస్తే అప్పటికా హీరో భజన హీరోయిన్లకు తప్పదన్నట్టు.. ‘జాను’ ప్రాజెక్టులోవున్న పూజ.. ప్రభాస్‌ను బాహుబలికి మించి చూపిస్తోందట. ‘ప్రభాస్‌ది ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నానని ఎక్కడైనా చెప్పడమే పాపం.. నువ్వు ప్రభాస్ ల్యాండ్‌నుంచి వచ్చావా? అంటూ ఆశ్చర్యపోతున్నారు’ అంటూ అతిశయోక్తిని పీక్స్‌లో చూపిస్తోందీ బ్యూటీ. అంతర్జాతీయ ఖ్యాతి అందుకుంటోన్న ప్రభాస్‌తో స్క్రీన్‌పై రొమాన్స్ చేసే చాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉందన్నది ప్రశంసకు ముక్తాయింపు. ‘సాహోకు టాక్‌తో సంబంధం లేకుండా నార్త్ ఇండియాలో ఆదరణ దక్కింది. అతన్ని చూడ్డానికి జనం థియేటర్లకు వచ్చారు. సల్మాన్‌ఖాన్ తరువాత అంతటి లాయల్ ఫాన్ బేస్ దేశమంతా ఉండటం మామూలు విషయం కాదన్నది పూజ మాట. ‘జాను’ షూటింగ్ చాలావుందట. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు కనుక, సినిమా వచ్చే ఏడాదిలోనే విడుదల కావొచ్చంటోంది. యూరోప్‌లో సెట్టయిన పీరియడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్ కనుక.. యురోపియన్ స్టయిలింగ్‌తోనే ప్రభాస్ పక్కన కనిపిస్తానని చెబుతోంది పూజ. జాను ఆలస్యం కావడం పూజకు కలిసొచ్చింది. పెండింగులన్నీ పూర్తి చేసుకుని తదుపరి షూట్‌కి రెడీ అవుతోన్న ఆనందంలో ఉందట పూజ. Fet