కాంతారా సినిమా పై పూజ హెగ్డే  ఏమందో తెలుసా?

చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి కన్నడలో వంద కోట్లు పైగా కలెక్షన్స్ సాధించిన ‘కాంతారా’ సినిమాను తెలుగు లో అల్లు అరవింద్ రిలీజ్ చేసాడు. మొదట్లో ఓటిటి రిలీజ్ చేద్దామనుకుని థియేటర్ లో రిలీజ్ చేసాడు అల్లు అరవింద్. ఈ సినిమా తెలుగు లోనే కాకుండా, హిందీ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందంటూ ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను తెలిపారు.

తాజాగా పూజ హెగ్డే కూడా ఈ సినిమా పై ప్రశంశలు కురిపించింది.  ఈ మూవీ అత్యద్భుతంగా ఉందని.. ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దారని ఆమె అన్నారు. ఈ మేరకు తన ఇన్ స్టా వేదికగా కాంతార గురించి ఆసక్తిక కామెంట్స్ చేసింది.

‘మీకు ఏం తెలుసో.. అదే కథగా రాయండి. మీ మనసుకు చేరువైన.. మీ హృదయంలో నుంచి వచ్చిన కథలనే ప్రేక్షకులకు చెప్పండి. ముఖ్యంగా ఈ సినిమా లోని చివరి 20 నిమిషాలకు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు చలించిపోయా. రిషబ్ శెట్టి.. కాంతార విశేషమైన ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నావు. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో ప్రశంసలు అందుకోవాలి. ‘ అంటూ రాసుకొచ్చారు పూజా..ఇప్పటికే ఈ సినిమా ఇప్పటివరకు రూ. 188 కోట్లకు పైగా వసూళు చేసి 200 కోట్లకు చేరువలో ఉంది.