శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం బెడిసికొట్టడంతో మానసికంగా కుంగిపోయిన నయనతార ఆ తరువాత తేరుకుని మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అయితే ఏ సినిమా అంగీకరించినా నిర్మాతలకు ఓ షరతు విధించడం మొదలుపెట్టింది. మీడియా ముందుకి రానని, ప్రమోషన్స్‌లో తన పాత్ర వుండదని, అలా అంగీకరిస్తేనే సినిమా చేస్తానన్నది నయనతార కండీషన్స్. క్రేజ్ వుండటంతో ఆమె చెప్పిన కండీషన్స్‌కి లోబడి నిర్మాతలు, కార్పొరేట్ ప్రొడక్షన్ కంపెనీస్ సినిమాలు చేయడం ప్రారంభించాయి.
అయితే ఆ కండీషన్సే ఇప్పుడు వాళ్లకి గుదిబండలుగా మారుతున్నాయట. దక్షిణాదిలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూనే తనదైన మార్కు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఇందులో ఆమె సిబ్బందికి ఇచచ్చే మొత్తం మళ్లీ వేరుగానే వుంటోందట. తాజాగా ఆమె సిబ్బంది టార్చర్ భరించలేక ఓ నిర్మాత నయనతారపై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
తమిళ నిర్మాత రాజన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారాన్ని రేపుతున్నాయి. నయనతార తనతో పాటు ఎనిమిది మంది అస్టెంట్‌లని తీసుకొస్తుందట. వారికి రోజుకి ఒక్కొక్కరికి ఏడు నుంచి ఎనిమిది వేలు ఇవ్వాల్సిందేనట. ఇలా అస్టెంట్‌లకే లక్ష వరకు ఖర్చు చేసిన తరువాత కారవాన్ అని, డ్రైవర్ బత్తా అని ఇలా నానా రకాలుగా నయన సిబ్బంది నిర్మాతల్ని బాదేస్తున్నారట. దీంతో ఆగ్రహించిన రాజన్.. నయనపై మండిపడటం చర్చనీయాంశంగా మారింది.