దెబ్బకు.. దేవరకొండకు.. మీడియా వ్యాల్యూ తెలిసొచ్చిందిట  

రౌడీ స్టార్ కి చీవాట్లు.. అంత త‌ప్పేం చేశాడ‌ని?

మీడియా,సోషల్ మీడియా రెండూ పెద్ద దెబ్బే కొట్టాయి

సాధారణంగా స్టార్స్ అంతా తమదైన సోషల్ మీడియా టీమ్ ని మెయింటైన్ చేస్తూంటారు. తమపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయటం కోసం వాటిపై ఆధారపడిపడుతూంటారు. అలాగే తమపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రాపగాండ చేస్తూంటే వారిని ఎండగట్టడం కూడా ఆ టీమ్ పని. విజయ్ దేవరకొండ కూడా అలాంటి కొంతమందితో కలిసిన సోషల్ మీడియా టీమ్ తోనూ, పీఆర్ పర్శన్స్ తోనూ జర్నీ చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న పోస్ట్ లు ,కామెంట్స్ పై చాలా అసంతృప్తిగా ఉన్నారని వినికిడి.

మరీ ముఖ్యంగా డియర్ కామ్రేడ్ చిత్రంపై సోషల్ మీడియాలో సరైన బజ్ క్రియేట్ కాలేదని ఆయన కంప్లైంట్ అని తెలుస్తోంది. మీడియా కూడా తనకు సహరకరించలేదని వాపోయారట. తను కష్టపడి తిరిగి ప్రమోట్ చేసిన విషయాలని సైతం ప్రెజెంట్ చేయలేదని, అది సినిమా ఓపినింగ్స్ పై పడిందని భావిస్తున్నారు. ఇంతకు ముందు కూడా సోషలో మీడియాలో తన ఏటిట్యూడ్ పై డిస్కషన్ జరిగినప్పుడు అది తనకు ప్లస్ అవుతుందని, ఓ వర్గం యంగ్ బ్యాచ్ తనకు దగ్గర అవుతారనే ఉద్దేశ్యంతో లైట్ తీసుకున్నారు. డియర్ కామ్రేడ్ విషయంలో అవన్నీ బ్యాక్ ఫైర్ అయ్యాయి. రివ్యూలను పాజిటివ్ గా తీసుకురాలేకపోయారు.

దానికి తోడు మీడియాలో ఓ వర్గం విజయ్ దేవరకొండ పై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. మొదటి నుంచి మీడయాను పెద్దగా పట్టించుకున్న ది లేదు. వారితో ఇంటరాక్ట్ అయ్యిందీ లేదు. మిగతా హీరోలు లాగ మీడియావారితో కలిసి మాట్లాడటం, రిలీజ్ అప్పుడు కానీ పుట్టిన రోజు అప్పుడు కానీ మీడియాని ఆహ్వానించి పార్టీ ఇవ్వటం వంటివి చేయలేదు. అతని సినిమా లు సూపర్ హిట్ అయ్యినప్పుడు అందరూ సపోర్ట్ చేసారు. అయితే ఒక్కసారిగా సినిమా ప్లాఫ్ అయ్యేసరికి మీడియా మొత్తం రివర్స్ అయ్యినట్లు అయ్యింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా టీమ్, మీడియా ని ఇంటరాక్ట్ అవ్వాలని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నాడని వినికిడి.