తెలుగులో ఒక్కో స్టార్ డైరెక్టర్‌ది ఒక్కో స్టయిల్. ఫలానా డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందీ అంటే -దాన్ని ఆడియన్స్ ముందుగానే అంచనా వేయగలిగేంత ముద్ర వేసుకున్నారు. అలాంటి స్టార్ డైరెక్టర్ల జాబితాలో కాస్త భిన్నంగా వినిపించే పేరు త్రివిక్రమ్. అన్ని తరగతుల ప్రేక్షకులనూ అలరించే కథలను తయారు చేసుకోవడంలో సమర్థుడు. పాత సినిమా కథాబీజానే్న తీసుకున్నా ముతక వాసన లేకుండా మాటలతో మైమరిపించే స్టామినా ఉన్నవాడు. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగ్స్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. దర్శకుడిగా ప్రతి సినిమాతోనూ తనదైన ముద్ర చూపిస్తున్న ఆయన గ్యాప్ తీసుకోకుండానే పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీలాంటి హీరోలతో సినిమాలు చేసేశాడు. ఈమధ్యనే అరవింద సమేతతో ఎన్టీఆర్‌ను ఓ రేంజ్‌లో చూపించిన త్రివిక్రమ్‌కు జూ.ఎన్టీఆర్ బాగా కనెక్టైపోయాడట. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ‘ట్రిపుల్ ఆర్’ ప్రాజెక్టులో బిజీగావున్న ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టును ఏమాత్రం ఆలోచించకుండా త్రివిక్రమ్‌తోనే ముందుకెళ్దామని నిర్ణయించుకున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ కాంటాక్ట్‌లోవున్న ఇద్దరి మధ్యా కథా చర్చలు కూడా పూర్తయ్యాయన్నది కథనాలకు అప్‌డేట్ పాయింట్. వస్తే బ్లాక్‌బస్టరే వస్తుంది తప్ప, త్రివిక్రమ్ నుంచి డిజాస్టర్లు రావడం చాలా చాలా అరుదు కనుక ఎన్టీఆర్ సెకెండ్ థాట్ లేకుండా ముందుకెళ్దామనే నిర్ణయించుకున్నాడని అంటున్నారు.
ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టు ఇదే!?
