‘పుర’ పోరు: వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఎవరి దమ్మెంతో తేలిపోవాల్సిందే.!

YSRCP vs TDP

పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్పేసుకున్నారు. అధికార పార్టీకే అడ్వాంటేజ్ వుంటుందని తెలిసీ, తెలుగుదేశం పార్టీ.. తాము పంచాయితీ ఎన్నికల్లో పుంజుకున్నామని ప్రకటించేసింది. రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరిగే ఎన్నికలని తెలిసీ అధికార పార్టీ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి తనదైన రాజకీయ ప్రచారం చేసుకుంది. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి గనుక.. పెద్దగా తప్పు పట్టాల్సినదేమీ లేదిక్కడ. సందట్లో సడేమియా జనసేన పార్టీ కూడా పంచాయితీ ఎన్నికల వేళ సందడి గట్టిగానే చేసింది. అయితే, పంచాయితీ ఎన్నికల కథ వేరు.. పురపాలక ఎన్నికల కథ వేరు. రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలకు, కార్పొరేషన్లకు, నగర పంచాయితీలకు సంబంధించి నగారా మోగింది.

YSRCP vs TDP
YSRCP vs TDP

గత ఏడాది ఎక్కడైతే ప్రక్రియ ఆగిందో, అక్కడి నుంచే ‘పురపోరు’ ప్రక్రియ షురూ కాబోతోంది. నామినేషన్ల దాఖలు ఎపిసోడ్ అప్పట్లోనే ముగిసింది. ఉపసంహరణ ప్రక్రియ దగ్గరే ఆగింది. అదిప్పుడు మళ్ళీ మొదలు కాబోతోంది. దాంతో, అధికార పార్టీకి కొత్తగా వచ్చిన సమస్య ఏమీ లేదు. ఏకగ్రీవాల పరంగా ఆల్రెడీ వైసీపీ సేఫ్ పొజిషన్‌లోనే వుంది. ఎటూ ఇవి కూడా స్థానిక ఎన్నికలే గనుక అధికార పార్టీకి అడ్వాంటేజ్ సహజంగానే ఎక్కువ వుంటుంది. ఈ ఎన్నికలు పార్టీల ప్రత్యక్ష ప్రమేయంతో జరుగుతాయి కాబట్టి, వైసీపీ బలమెంత.? టీడీపీ బలమెంత.? జనసేన బలమెంత.? అన్నది తేలిపోతుంది. ఓ అంచనా ప్రకారం, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి జనసేన పార్టీనే గట్టి పోటీ ఇచ్చింది. ఆ లెక్కన పుర పోరులో కూడా వైసీపీకి జనసేన నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. అయితే, పుర పోరుకి సంబంధించి జనసేన నామినేషన్లు తక్కువగానే పడ్డాయి.. టీడీపీతో పోల్చితే. కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి వీల్లేకుండా టీడీపీ, వైసీపీ కుట్రలు చేశాయన్న విమర్శలున్నాయి. ఏ రాజకీయ విమర్శల సంగతెలా వున్నా, అంతిమంగా గెలుపోటముల లెక్క కీలకం. సో, పుర పోరులో ఎవరి దమ్మెంతో తేలిపోనుందన్నమాట.