వివేకా హత్యకేసులో… సునీతను ఇరికించేసిన షర్మిల?

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో రకం ట్విస్టులు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు సంబంధించి.. వైసీపీ నేతలు గ‌త కొంత కాలంగా చేస్తున్న వాద‌న‌లకు పూర్తి విరుద్ధంగా ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. దీంతో… షర్మిల వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పాడేశాయనే కామెంట్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే… ఇందులో మరోకోణం కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

తాజాగా తన చిన్నాన్న, వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్ షర్మిల స్పందించారు. వివేకాను ఆస్తికోసం ఆమె కూతురు సునీత, ఆమె భర్త కలిసి హత్యచేశారని అంటున్నారని.. అందులో అర్ధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకూ షర్మిళ ఏమన్నరంటే… సునీత పేరుపై ఏనాడో ఆస్తుల్ని క్రియేట్ చేసిందే వివేకానంద‌రెడ్డి అని.. తమ చిన్నాన్న‌, చిన్నమ్మల పేర్లపై ఆస్తులు లేవ‌ని.. ఒక‌వేళ ఒక‌టో అరో వివేకా పేరుపై ఆస్తులున్నా కూడా… వారి త‌ద‌నంత‌రం సునీత పిల్లలకు చెందేలా వీలునామా.. త‌న చిన్నాన్న వివేకా ఎప్పుడో రాయించార‌ని ష‌ర్మిల సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టారు.

అయితే కాస్త లోతుగా అబ్జర్వ్ చేస్తే… ఇక్కడ మరో కోణం దాగుందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే… వివేకా ఆస్తులన్నీ సునీత పేరిట “రిజిస్టర్” అయ్యి లేవు. కేవలం వివేకా.. తన కూతురు సునీత పేర “వీలునామా” రాశారంట! అది జరిగి ఇప్పటికే చాలా కాలం అయిందని.. వీలునామా అనేది శాశ్వతం కాదని అంటున్నారు. ఒకవేళ రిజిస్టరు చేసి ఉన్నా సరే… ఆ “వీలునామా”ను అదే వివేకా మళ్లీ మార్పించి రాయించి, మళ్లీ రిజిస్టరు చేయడానికి లీగల్ గా అవకాశం ఉంటుందట!

అంటే.. వివేకానందరెడ్డి జీవించి ఉంటే… సునీత పేరిట ఉన్న ఆస్తులు ఏదో ఒక క్షణంలో పూర్తిగా వివేకా రెండో భార్య కొడుకు పేరు మీదికి మారిపోయే అవకాశం లేకపోలేదనేది ఇక్కడ పాయింట్ అని అంటున్నారు! ఎందుకంటే… సదరు వ్యక్తి, తన వీలునామాను ఎప్పుడైనా తిరిగరాయించే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన కూడా చూస్తే… సునీత, ఆమె భర్తకే వివేకాను హత్య చేయించాల్సిన అవసరం ఉంటుందని మరో వాదన తెరపైకి వస్తుంది. షర్మిల మాటలను లోతుగా గమనించిన వారికి ఈ అనుమానం కలుగుతుంది.

ఏది ఏమైనా… ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా, మరెవరెన్ని విశ్లేషణలు చేసినా… అల్టిమెట్ గా ఈ హత్య వెనకున్న సూత్రదారులు, పాతదారులను తేల్చాల్సింది సీబీఐ – న్యాయస్థానం!