జగన్ ప్రభుత్వ దూకుడుతో గజగజలాడుతున్న రాధాకృష్ణ 

ABN RK Kothapaluku
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న చోటు చేసుకున్న సంచలన సంఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది.  ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, అధినేత చంద్రబాబు, ఆయన ముఠాకు రోజులు దగ్గర పడ్డాయని రాధాకృష్ణకు అవగతమై పోయింది.  దాంతో ఎలాగైనా జగన్ మీద దుష్ప్రచారాన్ని మరింత పెంచాలని కంకణం కట్టుకున్నట్లున్నాడు.  ఏవో చెప్పబోయి మరేవో చెబుతూ తన కాళ్ళకింద తానె గొయ్యి తవ్వుకుంటున్నాడు.  ఈవారం చెత్తపలుకులో రాధాకృష్ణ మనోభీతి ప్రతి వాక్యంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది.  న్యాయం పైనే సమరం అంటూ తన అతి తెలివిని ప్రదర్శించి కొన్నిచోట్ల అడ్డంగా బుక్కైపోతున్నాడు!  
 
ABN RK Kothapaluku
 
***
 
“”” ఎన్డీఏలో చేరాల్సిందిగా నరేంద్ర మోదీ కోరిందీ లేదు. ప్రత్యేక హోదాతో ఆ అంశాన్ని ముడిపెట్టిందీ లేదు. అయినా ఈ ప్రచారం ఎందుకు చేయించుకున్నారంటే, ప్రజల దృష్టిని మళ్లించడానికే! ప్రధానితో ముఖ్యమంత్రి ఒక్కరే సమావేశమయ్యారు.”””
 
ఎన్డీయేలో చేరాల్సిందిగా నరేంద్ర మోడీ కోరారని జగన్ ఎప్పుడు చెప్పారు?  మా సమావేశంలో అసలు ఆ ప్రస్తావనే రాలేదని, ప్రత్యేక హోదా ఇస్తేనే ఆలోచిస్తామని, అంతవరకూ బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండవని జగన్ మోడీకి స్పష్టం చేశారని తెలుగు క్షుద్ర పత్రికలు వ్రాయకపోయినా జాతీయ పత్రికలు మాత్రం ప్రముఖంగా ప్రచురించిన సంగతి రాధాకృష్ణకు తెలుసో తెలియదో?  ప్రధానితో ముఖ్యమంత్రి ఒక్కరే సమావేశం కావడంలో నేరం ఉన్నదా?  వారు క్షుద్రజ్యోతి కెమెరాల ముందు కూర్చుని చర్చించుకోవాలా?  
 
****
 
“””కేంద్రప్రభుత్వంతో జగన్మోహన్‌రెడ్డ్డికి ఎన్నికల ముందు నుంచీ అవగాహన ఉంది. ఒక ప్లాన్‌ ప్రకారం తెలుగుదేశం పార్టీకి–బీజేపీకి మధ్య సంబంధాలు చెడిపోయేలా చేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జగన్‌ హామీ ఇచ్చారు”””
 
హేమిటీ!  నలభై ఏళ్ళ అనుభవం కలిగిన చంద్రబాబును కూడా బోల్తా కొట్టించారా జగన్!!  జగన్ వేసిన ప్లాన్ చంద్రబాబు నమ్మేసి బుట్టలో పడిపోయారా?  బీజేపీతో సంబంధాలు తెంచేసుకున్నారా?  ఇది జగన్ కు మెచ్చుకోలు అని భావించాలా లేక చంద్రబాబు తెలివితక్కువకు అభిశంసన అని నమ్మాలా?  కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించడం తప్పా?  మొన్న వ్యవసాయ బిల్లుకు చంద్రబాబు ఎందుకు మద్దతు ఇచ్చారు మరి?  తన రాజ్యసభ సభ్యులు నలుగురిని మోడీ పాదాలవద్దకు ఎందుకు పంపించారు?  తాను అధికారంలో ఉన్నప్పుడు నోట్ల రద్దును, జిఎస్టీని చంద్రబాబు ఎలా సమర్ధించారు?  ఒకవేలు ఎదుటివారివైపు చూపిస్తే నాలుగు వేళ్ళు మానముఖాన్ని చూపిస్తాయని తెలియదా?  
 
****
“””ఇందుకు భిన్నంగా బీజేపీతో నేరుగా చేతులు కలిపితే జగన్మోహన్‌రెడ్డ్డికి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. బీజేపీ కోణం నుంచి చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు బలపడకూడదు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ తమ చెప్పుచేతల్లో ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోంది.””””
 
ఓహో….బీజేపీతో చేతులు కలిపితే జగన్ కు రాజకీయంగా నష్టమని రాధాకృష్ణకు ఎంత జాలి వేస్తున్నదో కదా!  జగన్ కు నష్టం అయితే చంద్రబాబుకు లాభమే కదా!  తెలుగుదేశం తో బీజేపీ నాలుగేళ్లు పొత్తు పెట్టుకున్నది ఎందుకు?  చంద్రబాబును తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికేనా?  
 
****
“””కేంద్రంతో సఖ్యతగా మెలగాల్సిన అవసరం జగన్‌కు ఎక్కువగా ఉంది. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి ఉపశమనం పొందడానికి కేంద్ర పెద్దలు సహకరిస్తారేమోనన్న ఆశతో వారి వద్ద విధేయుడిగా ఉంటున్నారు.  గతంలో 16 నెలలపాటు జైలులో ఉన్నప్పుడు బెయిల్‌ పొందడానికై అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ సహకారాన్ని కూడా జగన్‌ అండ్‌ కో పొందారు. జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ను కలిసి జగన్‌కు బెయిల్‌ ఇప్పించవలసిందిగా కోరినట్టుగా విస్తృతంగా ప్రచారం జరిగింది.”””
 
కేంద్రంతో సఖ్యతగా మెలగాల్సిన అవసరం ఎవరికి ఉందొ గత ఏడాదిన్నరగా దేశం చెవులు చిల్లులు పడేట్లు మోడీ కటాక్షం కోసం చంద్రబాబు పడుతున్న తిప్పలు తెలియజేస్తూనే ఉన్నాయి.  మోడీని బండబూతులు తిట్టిన నోటితోనే మోడీ సుప్రభాతలను ఆలపిస్తున్నారు చంద్రబాబు. జగన్ మాత్రం ఈరోజు వరకు బహిరంగంగా మోడీకి భజన చేసిందే లేదు!  అనగా చంద్రబాబు ప్రస్తుతం మోడీ భజన చేస్తున్నది కేసులనుంచి ఉపశమనం కలిగిస్తారనేనా?  మరి ఈ స్టేట్మెంట్ గౌరవ న్యాయస్థానాలను అవమానించడం కాదా?  న్యాయస్థానాల నిజాయితీని శంకించడం కాదా?      ఒకే పేరాలో రెండు రకాల నాలుకలు ప్రదర్శిస్తున్నాడు రాధాకృష్ణ.  బెయిల్ కోసం యూపీఏ సహకారాన్ని పొందారు అని ఒక వాక్యంలో చెబుతూ ఆ తరువాత వాక్యంలో అహ్మద్ పటేల్ ను కలిసి బెయిల్ ఇప్పించవలసిందిగా కోరినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది అని తన మాటలను తానే ఖండించుకుంటున్నాడు!  అంతే అంతా పుకార్లే తప్ప రాధాకృష్ణకు అసలు  వాస్తవం ఏమిటో తెలియదు మరి!   
 
 
*****
“””చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కావాలి– ఇది కావాలి, అదనపు నిధులు అని అడగడంపై నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ ముఖ్యుల వద్ద చిరాకుపడ్డారు. “””
 
హాస్యానికి కూడా హద్దు ఉండాలి అనేవారు దర్శకులు జంధ్యాల.  చంద్రబాబు ఎప్పుడు వచ్చినా జగన్ మీద కేసులను వేగవంతం చెయ్యండి అని మాత్రమే మంత్రులను కోరేవారని ఒక కేంద్రమంత్రే మీడియా ముందు కుండబద్దలు కొట్టారు.     పోలవరంను ఏటీఎం లా వాడుకున్నాడు చంద్రబాబు అని ఆంధ్రప్రదేశ్ లోనే మోడీ స్పష్టం చేసిన సంగతి రాధాకృష్ణ మరచిపోయాడా?  అందుకనే మోడీ ఆయన్ను దూరంగా పెట్టిన సంగతి అందరికీ తెలుసు ఒక్క రాధాకృష్ణకు తప్ప!
 
******
“””ప్రధానితో సమావేశం కావడానికి ముందే కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆయనను ఢిల్లీ పిలిపించుకుని న్యాయ వ్యవస్థతో చెలగాటం వద్దని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.”””
 
అవును మరి…అమిత్ షా జగన్ ను హెచ్చరిస్తున్నపుడు రాధాకృష్ణ అమిత్ షా కూర్చున్న సోఫా వెనుకనే దాక్కున్న సంగతి అమిత్ షాకు తెలియదు.  జగన్ కు అంతకన్నా తెలియదు.  అందుకనే అమిత్ షా తలంటు పోస్తుంటే జగన్ చమ్మగా పోయించుకున్నాడు!  అమిత్ షా అలా హెచ్చరించినట్లు దేశంలోని  ఏ పత్రికల్లో వార్తలు వచ్చాయి ఒక్క క్షుద్రజ్యోతిలో మినహా? 
 
***
“””ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్స్‌ కారు. వారు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు.”””
 
అబ్బా…ఇంత తెలివి యాడనుంచి వచ్చిందబ్బా…మన రాధాకృష్ణకు…హబ్బా….హబ్బబ్బా….హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్స్ కారని రాధాకృష్ణకు ఇన్నాళ్లకు తెలిసిందేమో కానీ, టెన్త్ క్లాస్ తప్పినవాడికి కూడా ఆ విషయం తెలుస్తుంది.  రాధాకృష్ణకు తెలియని విషయం ఏమిటంటే…ప్రజలతో నేరుగా ఎన్నిక కాబడిన పార్టీ ప్రభుత్వాధినేత, ప్రభుత్వం, మంత్రులు, అధికారులు హైకోర్టుకు సబార్డినేట్స్ కారని….అయితే, హైకోర్టు సమన్లు ఇస్తే ఎంతటివారైనా కోర్టు ముందు హాజరు కావాల్సిందే.  అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన స్టే అయినా, సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి కొట్టేస్తే అది వెకేట్ అవుతుంది.. రాధాకృష్ణ తెలుసుకుంటే చాలు.  
 
***
“””న్యాయమూర్తులు నిజంగానే పరిధి అతిక్రమించి వ్యవహరిస్తున్నారా? లేక రాష్ట్ర ప్రభుత్వమే అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకుంటోందా? అనే విషయం ఇప్పుడు పరిశీలిద్దాం.”””
 
“పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం” అని చెప్పాడట! అలా వుంది మన రాధాకృష్ణ గారి వరస!   న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టిన  గౌరవ న్యాయమూర్తులు ఎలా వ్యవహరిస్తున్నారో,  యాభై శాతం ఓట్లతో అధికారాన్ని చేప్పట్టిన ప్రజానాయకుడి సారధ్యంలోని ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నదో చదువు సంధ్య లేని బాధాకృష్ణ పరిశీలిస్తాడట!  హహ…నవ్వుతారన్న ఇంగితం కూడా లోపించిందే!  హతవిధీ….
 
****
“””అప్పట్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కరోనా వైరస్‌ కాదు– కమ్మ వైరస్‌ అని స్పీకర్‌ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం సైతం వ్యాఖ్యానించారు.””””
 
రాధాకృష్ణకు మతిమరపు లేదు.  కానీ ఆయన అలా మతిమరపు రోగం ఉన్నట్లుగా నటిస్తాడు.  అల్జీమర్స్ వ్యాధి సోకిందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ప్రియభక్తుడు కదా ఆయన!  కోడెల శివప్రసాదరావు సభాపతిగా ఉన్నప్పుడు కమ్మ సంఘం వారు నిర్వహించిన వనభోజనాలకు వెళ్లి “మరో పాతికేళ్ళు మన కమ్మవారే అధికారంలో ఉండాలని” ప్రవచించిన సంగతి ఎవరైనా గుర్తు చేస్తే బావుణ్ణు!  
***
 
“””ఇందులో ఇంకో మర్మం కూడా ఉంది. రేపో మాపో అవినీతి కేసులలో జగన్‌రెడ్డికి శిక్ష పడితే– ”చూశారా మేం చెబుతున్నట్టుగానే మా ముఖ్యమంత్రిని అన్యాయంగా జైలుకు పంపారు” అని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవచ్చు. నిజానికి ఇదే అసలు లక్ష్యం! తాను చేసిన తప్పులేమిటో మన కంటే జగన్మోహన్‌రెడ్డ్డికే ఎక్కువ తెలుసు! అందుకే సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో తనకు శిక్ష పడటం ఖాయమని ఆయన భావిస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా ప్రజలు, తాను అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణకు రాకుండా ఉండటానికై న్యాయ వ్యవస్థతో ఘర్షణకు దిగుతున్నారు.””””
 
పాపం రాధాకృష్ణ!  ఇంతవరకూ జగన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసు ఒక్కటి కూడా రుజువు కాలేదు.  అప్పుడే శిక్ష వరకు వెళ్ళిపోయాడు.   ఇక ముఖ్యమంత్రిని జైలుకు పంపిన తరువాత వైసిపి నాయకులు ఎలా ప్రచారం చేసుకుంటారో మరి?  జయలలిత, లాలూ ప్రసాద్, మధుకోడా లాంటివారు జైలుకు వెళ్ళినపుడు ఆ తీర్పులను గౌరవించారు తప్ప కోర్టులకు వ్యతిరేకంగా ఆయా పార్టీలవారు ప్రచారాలు చెయ్యలేదు.  చేసినా ప్రయోజనం ఉండదు.  ఒకవేళ చంద్రబాబు  జైలుకు వెళ్తే టిడిపి వారు అలాంటి ప్రచారం చేస్తారేమో తెలియదు.  భూములు ఇచ్చినా మా చంద్రబాబును జైలుకు పంపించారు అని ప్రచారం చేసుకోవడానికే న్యాయమూర్తులకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారేమో వారు?  
****
 “””చంద్రబాబుకు మేలు చేయడం కోసం అవినీతి కేసులలో తనను శిక్షించబోతున్నారని ముఖ్యమంత్రి దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. “”””
 
వావ్!   అసలు నిజం కక్కేసాడు రాధాకృష్ణ!!  దొంగతనం చేసినవాడు ఎన్ని కట్టు కథలు అల్లినా, పోలీసుల ముందు ఏదో ఒక క్లూ ఇచ్చేసి అడ్డంగా దొరికిపోతాడు.  మన రాధాకృష్ణ కూడా అలాగే దొరికిపోయాడు.  అవినీతి కేసులలో జగన్ ను శిక్షిస్తారని ముందుగా రాధాకృష్ణ మైండ్ సెట్ అయిపొయింది.  అది దేనికి?  చంద్రబాబుకు మేలు చెయ్యడం కోసమే జగన్ ను శిక్షిస్తారని రాధాకృష్ణ ఒప్పేసుకున్నాడు!  అంటే జగన్ ను శిక్షించి  చంద్రబాబుకు మేలు చెయ్యాలని ముందుగానే నిర్ణయం జరిగిపోయిందన్నమాట!!  అందుకే కదా పేరు పెట్టి మరీ జగన్ ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది!  జగన్ చేసిన తప్పేమీ లేదని రాధాకృష్ణ వ్యాఖ్యల ద్వారా రుజువైపోయింది.  ఇంత  బరితెగించిన పాత్రికేయడు ఆంధ్రదేశంలో ఉండటం తెలుగువారి దౌర్భాగ్యం కదా!!  ఏమంటారు తమ్ముళ్లూ???
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు