బరితెగింపు రాతల రాధాకృష్ణ 

ABN Radha Krishna With YS Jagan
 
“ఎర్ర గురివింద తన కింది నలుపెరుగనట్లు” అనే సామెతను ఎవరు సృష్టించారో కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణ అది అక్షరాలా సత్యమని తన చెత్తపలుకు ద్వారా ఈరోజు మరోసారి రుజువు చేసుకున్నాడు.  తన కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటివారి కంట్లో నలుసును వెదకడం, ఎత్తి చూపడం ఈ భూప్రపంచంలో ఒక్క రాధాకృష్ణకు మాత్రమే చెల్లిన గారడీ విద్య.  అత్యంత పవిత్రమైన న్యాయవ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోవడం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మాత్రమే ప్రారంభమైంది.  గౌరవనీయులైన న్యాయమూర్తులతో రాసుకుని పూసుకుని తిరగడం, వారిని అర్ధరాత్రివేళ విందులకు, వినోదాలకు ఆహ్వానించడం, కానుకలతో సత్కరించడం, మురిపించడం, మెప్పించడం ఈ దేశరాజకీయాల్లో ఒక్క చంద్రబాబు విషయంలోనే చూశాము.  యావద్దేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి సైతం ఏనాడూ న్యాయమూర్తులతో రహస్య సమావేశాలు జరపగా, వారితో విందులు కుడవగా మనం చూడలేదు.  ఇవాళ న్యాయవ్యవస్థకు కూడా మకిలి అంటుతున్నదంటే ఆ పాపం చంద్రబాబుది తప్ప మరొకరిది కాదు.  ఆ మురికిని వదిలించాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు విషపూరితమైన వ్యాఖ్యలతో మరింత బురద అంటిస్తున్న రాధాకృష్ణ బరితెగింపు రాతలను ఒకసారి పరిశీలిద్దాం. 
 
ABN Radha Krishna With YS Jagan 
 
“వ్యక్తిత్వ హననం జరుగుతుందని భావించినప్పుడు పిటిషనర్లు ఇలాంటి అభ్యర్థనలు చేయడం మమూలే! వాదనల అనంతరం శ్రీనివాస్‌ కోరిన విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులు మీడియా స్వేచ్ఛకు విఘాతమనీ, పత్రికల గొంతు నొక్కేయడమేననీ అధికార పార్టీ నాయకులు విమర్శించారు.”
 
కదా మరి!  వ్యక్తిత్వ హననాన్ని ఎవరు మాత్రం భరిస్తారు?  కానీ, రాధాకృష్ణ దృష్టిలో ఆ వ్యక్తిత్వం అనేది ఒక్క చంద్రబాబుకు, ఆయన భజన చేసేవారికి మాత్రమే ఉంటుంది.  జగన్ మోహన్ రెడ్డి అనే ఒక పార్లమెంట్ సభ్యునికి మాత్రం లేదు.  అందుకనే ఏనాడూ తండ్రి పాలన సాగుతున్నప్పుడు హైదరాబాద్ లోనే అడుగు పెట్టని జగన్ తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేశాడని ఇష్టం వచ్చినట్లు కథలు రాసేశారు!   ఈ దేశంలో ఏ ఒక్క కోర్టులోనూ జగన్ మీద ఆరోపణలు రుజువు కాకపోయినప్పటికీ, జగన్ ను నేరగాడుగానే చిత్రిస్తూ బరితెగింపు రాతలు రాశారు.  చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును సర్వనాశనం చెయ్యడానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి క్షుద్రపత్రికలు చేసిన కుటిల ప్రయత్నాలు ఎవరైనా మర్చిపోయారా?  జగన్ జైలుకు వెళ్తుంటే, ఆయన భార్య బట్టలు సూట్ కేసులో సర్ది ఇస్తున్నట్లు పరమ దుర్మార్గమైన కార్టూన్లు వేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందారు.  రాధాకృష్ణ దృష్టిలో జగన్ కు వ్యక్తిత్వం లేదు.  చంద్రబాబు హయాంలో అధికారపదవులు అనుభవించిన ఏజీకి మాత్రం వ్యక్తిత్వం ఉన్నది!  ఆయన మీద ఎసిబి ఆరోపణలతో ఎఫైఆర్ నమోదు చేసినప్పటికీ, ఆయన గూర్చి ఎవ్వరూ రాయడానికి వీల్లేదు.  ఎందుకంటే ఈ భూప్రపంచంలో ఆయన ఒక్కరికే వ్యక్తిత్వం ఉన్నది మరి!  
 
***
 
“ఫలానా చోట రాజధాని వస్తుందని అప్పటి ప్రభుత్వం 2014 సెప్టెంబరు మొదటి వారంలో ప్రకటించిన తర్వాత మాత్రమే శ్రీనివాస్‌ గానీ, ఆయన బంధువులు గానీ అక్కడ భూములు కొనుక్కున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత లావాదేవీలు జరిగితే అది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అవుతుందని ఈ దేశంలో ఏ చట్టం చెబుతోందో జగన్‌ అండ్‌ కో స్పష్టం చేయాలి.”
 
ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నది జగన్ అండ్ కో కాదు.  సాక్ష్యాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ!  తన మీద ఆరోపణలు వచ్చినపుడు కోర్టులు రుజువు చేసుకునే అవకాశం ఉండగా శ్రీనివాస్ ఎందుకు తప్పించుకుంటున్నట్లు?  ఆయన ఎప్పుడు భూములు కొన్నారో,  ఆ భూములను ఎంతకు కొన్నారో, ఆ డబ్బును ఎలా చెల్లించారో మొదలైన వివరాలు కోర్టులో రుజువు చేసుకోవచ్చు కదా?  ఎందుకు సదవకాశాన్ని వదులుకుంటారు?  శ్రీనివాస్ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి మధ్యలో పత్రికా యజమాని ఎవరు?  వారిద్దరికీ ఏమిటి సంబంధం?  
 
 
****
“మరి ఆయన విజయనగరంలో కొనుక్కోకుండా విశాఖ, హైదరాబాద్‌లలో ఎందుకు కొన్నారో చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పులివెందులలో కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్దఎత్తున ఆస్తులను ఎందుకు సమకూర్చుకున్నారు? తాడేపల్లిలో బినామీ పేరు మీద భవనాన్ని ఎందుకు కట్టుకున్నారు? రాజధానిలో భూమి ఉండాలని ఎవరైనా భావిస్తారు కదా? “
 
బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, హైద్రాబాద్ లో కొన్న స్థలాలు కొన్నారు.  అంతే తప్ప దమ్మాలపాటి శ్రీనివాస్, లోకేష్ నాయుడు, పుల్లారావు లాగా నలభై ఎకరాలు, యాభై ఎకరాలు కొన్నారా?  జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు.  ఆయన మొన్నటిదాకా ప్రతిపక్ష నాయకుడు..నేడు ముఖ్యమంత్రి.  ఆయన హైద్రాబాద్ లో ఇల్లు కట్టుకోవడం తప్పా?  మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ లో లంకంత కొంప ఎందుకు కట్టుకున్నారు?  ఆయనది ఆంధ్రప్రదేశ్ కదా?  ఆయనకు హైద్రాబాద్ రాజధాని నగరం కాదు కదా?  అమరావతి రాజధానిగా ప్రకటించిన తరువాత కూడా హైద్రాబాద్ లో మూడు వందల కోట్ల రూపాయలతో ఎందుకు రాజభవనాన్ని నిర్మించుకున్నట్లు?  ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు అధికారిక నివాసం ఉన్నప్పటికీ, తన కుటుంబం మొత్తాన్ని తెలంగాణాలో పార్క్ హయత్ హోటల్లో ఏడాది పాటు ఉంచి వందలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు తగలేసినట్లు?  ఒక స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం యాభై ఎకరాలు కొనుక్కోవడం ఒకటేనా?  ఎవరి చెవిలో పూలు పెడతారు రాధాకృష్ణ గారు?  
 
****
Amaravati
“శ్రీనివాస్‌, ఆయన బంధువులు 40 ఎకరాలు కొనుగోలు చేశారనీ, అందులో 10 ఎకరాలు కోర్‌ క్యాపిటల్‌లో ఉన్నాయనీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.    అప్పనంగా లాభపడే ఆలోచనే చేసి ఉంటే మొత్తం 40 ఎకరాలను కోర్‌ క్యాపిటల్‌లోనే కొనుగోలు చేసేవారు కదా? రాజధానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచికచర్లలో కొనుగోలు చేసిన భూమిని కూడా ఈ ఖాతాలో వేయడాన్ని బట్టి ప్రభుత్వ ఆంతర్యం అర్థమవుతోంది.”
 
“అబ్బబ్బబా.. ఏమి తెలివి? ఏమి సమర్ధన!   ఈమాత్రం తెలివి చట్టం పట్ల కూలంకష ప్రజ్ఞావంతుడైన దమ్మాలపాటి వారికి తెలియకుండా ఉంటుందా?  మొత్తం కొర్ కాపిటల్లో కొనుగోలు చేస్తే ఆనాడే ఆ కుంభకోణం బయట పడదా?  రాజధానికి 70  కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచికచర్లలో కొనుగోలు చేశారంటే అమరావతి రాజధాని పరిధిని కంచికచర్ల వరకు విస్తరించే కుతంత్రం ముందుగానే తెలిసింది అనుకోవాలి.  
 
****
“ఉమ్మడి రాష్ట్రంలో రాజ్‌భవన్‌లోనే అప్పటి గవర్నర్‌ ఎన్‌.డి.తివారీ రాసలీలలకు పాల్పడిన విషయాన్ని స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఏబీఎన్‌ చానెల్‌ బయటపెట్టినప్పుడు, సదరు కథనాన్ని ప్రసారం చేయకుండా నిలిపివేయాలని అప్పటి హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో! న్యాయ వ్యవస్థను నిందిస్తున్నవారు ఇప్పుడు ఏం చెబుతారు? మేము కేసులు పెట్టకూడదా? దర్యాప్తు చేయకూడదా? అని జగన్‌ అండ్‌ కో ప్రశ్నిస్తోంది.”
 
గవర్నర్ రాసలీల వ్యవహారం ఆయన ఒక్కడికి సంబంధించింది.  అమరావతి కుంభకోణం తెలుగుదేశం పార్టీ మొత్తానికి సంబంధించింది.  తివారి వ్యవహారంలో ఆయన మాత్రమే ముద్దాయిగా నిలిచాడు.  ప్రజలెవ్వరికీ ఆర్ధిక, ప్రాణ, మాన నష్టం జరగలేదు.  అమరావతి కుంభకోణంలో వేలాది మంది రైతులు దోపిడీకి గురయ్యారు.  వారి నుంచి కొద్ది లక్షల్లో కొన్న ఎకరాలను తరువాత కోట్ల రూపాయలకు అమ్మేసుకుని రైతులను నిలువునా మోసం చేశారు.  తివారి గత  రాజకీయ జీవితాన్ని,  హోదాను దృష్టిలో పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ లాంటి ఆ వీడియో ప్రసారాలను ఆపెయ్యమని కోర్ట్ ఆదేశించడం  సబబే.  రాజధాని అనేది వేలకోట్ల  రూపాయల ఆర్ధిక కుంభకోణం.  ఆ రెండింటిని  పోల్చడం  అంటే  వానపాముతో  కొండచిలువను,  కోడెత్రాచును  పోల్చడం  కాదా?     
 
****
“ఒక తెలుగువాడు సుప్రీంకోర్టులో అత్యున్నత స్థానానికి చేరుకోకుండా అడ్డుకోవడానికి పన్నుతున్న పన్నాగాలను చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా? ఆ న్యాయమూర్తి టార్గెట్‌గా జగన్‌ అండ్‌ కో చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులను బట్టి వారి ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోంది కదా? “
 
ఇప్పుడు రాధాకృష్ణ మనసులోని భయం బయటపడింది.  ఆ తెలుగువాడి కుమార్తెల పేర్లు  భూ కుంభకోణంలో చోటు చేసుకోవడంతో “మనవాడి” భవిష్యత్తు ఎక్కడ దెబ్బ తింటుందో అని రాధాకృష్ణ హరీంద్రమ్ తరుముతున్న  హరిణంలా వణికిపోతున్నాడు!   ఆ న్యాయమూర్తి టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారని రాధాకృష్ణ డిక్లేర్ చెయ్యడమేమిటి?  దీన్నిబట్టి అర్ధం రావడంలేదా…ఆ న్యాయమూర్తి ఉన్నత స్థానానికి చేరుకుంటే జగన్ మీద కక్ష సాధించే దురుద్దేశ్యం రాధాకృష్ణ అండ్ కో కు ఉన్నట్లు స్పష్టం కావడం లేదా?  ఇలాంటి రాతలు రాయడం ఆ న్యాయమూర్తిని అవమానించడం కాదా?  ఆయన రికార్డు మీద మసి పూయడం కాదా?  అనుమానాలు రేకెత్తించడం కాదా?  ఆ న్యాయమూర్తికి రాధాకృష్ణ మేలు చేస్తున్నాడా లేక కీడు చేస్తున్నాడా?  రాధాకృష్ణ రాతల వలన దేశవ్యాప్తంగా ఆ న్యాయమూర్తి మీద లేనిపోని సందేహాలు కలుగుతున్నాయి కదా!
 
***
“కులగజ్జిని ఒళ్లంతా అంటించుకుని, కుల ద్వేషాన్ని నరనరాన నింపుకోవడం వల్ల కుళ్లిపోయిన కొంతమంది మేధావులు కూడా ప్రభుత్వానికి వంతపాడటం వింతగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌ రాజా ఇళంగో అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డికి ఉపశమనం కలిగే విధంగా స్టేలు ఇచ్చారు. భారతి సిమెంట్‌ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేయగా, జస్టిస్‌ రాజా ఇళంగో స్టే విధించారు. హెటిరో ఫార్మా కంపెనీకి కూడా ఇటువంటి ఉపశమనాన్నే కల్పించారు.    అవినీతి కేసులలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది కూడా జస్టిస్‌ రాజా ఇళంగోనే! జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది క్రితం సదరు జస్టిస్‌ రాజా ఇళంగోను రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా నియమించారు. “
 
హాహాహా…పంచతంత్రంలో బాటసారికి బంగారం ఆశ చూపించి భోంచేసిన వ్యాఘ్రం కథ గుర్తుకొస్తుంది రాధాకృష్ణా!  కులగజ్జి కి కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల తమ కులగజ్జి రాతలతో ఆ కులానికే తలవంపులు తెచ్చారు గత నలభై ఏళ్లుగా.  ఆ కులం వారంటే ఇతర కులాలవారు భయపడేట్లుగా కులగజ్జిని  అంటించి సమాజాన్ని సర్వనాశనం చేసిన ఈ ముగ్గురు కులగజ్జి గురించి మాట్లాడుతుంటే దేనితో నవ్వాలి?   ఇక జస్టిస్ రాజా ఇళంగో బెయిల్ ఇచ్చారంటే…పదహారు నెలల పాటు జైల్లో పెట్టినా, ఒక్క ఆరోపణను కూడా రుజువు చెయ్యలేని నాటి సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ అసమర్థతే కదా కారణం?  ఒకే వ్యక్తి మీద పదకొండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసి, జగన్మోహన్ రెడ్డికి న్యాయపరంగా తొంభై రోజులకు రావాల్సిన బెయిల్ ను అడ్డుకునే కుట్రను గమనించి జగన్ కు బెయిల్ మంజూరు చెయ్యడం జరిగింది.  ఇక సదరు జస్టిస్ కు పదవీవిరమణ తరువాత జగన్ పదవి ఇచ్చాడని చెప్పడం ద్వారా ఆనాడు జస్టిస్ రాజా ఇళంగో నిజాయితీ మీద బురద చల్లడం కాదా?  న్యాయస్థానాన్ని అవమానించడం కాదా?    హైకోర్టుకు దురుద్దేశ్యాలను ఆపాదించడం కాదా?  ఇది కచ్చితంగా కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కిందికి వస్తుంది.  ఈ అంశం మీద రాధాకృష్ణపై ఎవరైనా కోర్టులో కేసు వెయ్యాలి.  మరి మొన్న అచ్చెన్నాయుడుకు, కోళ్లు రవీంద్రకు  బెయిల్ ఇచ్చింది హైకోర్టు.  ఆ బెయిల్ ఇచ్చిన సదరు న్యాయమూర్తికి కూడా ఇలాంటి దురుద్దేశ్యాలనే ఆపాదిస్తారా రాధాకృష్ణ?  జగన్ మీద విచారణకు ఆదేశించిన జస్టిస్ కక్రూకు పదవీవిరమణ చేసిన ఇరవైనాలుగు గంటలు తిరగకుండానే మానవహక్కుల కమీషన్ చైర్మన్ గా నియమించారు.  దాన్నేమనాలి?  జగన్ మీద విచారణకు ఆదేశించినందుకు బహుమతి అని విశ్వసించాలా?  
 
***
” గతంలో జగన్‌ అండ్‌ కోపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన సీబీఐని పంజరంలోని చిలుక అని నిందించారు. అప్పుడు చేదుగా ఉన్న సీబీఐ ఇప్పుడు తీపిగా ఎందుకు మారిందో తెలియదు.   ఒకనాడు పంజరంలో చిలుకగా అభివర్ణించిన సీబీఐనే ఇప్పుడు కావాలనుకోవడం ఏమిటి? అంటే భూకుంభకోణంలో తాము ఎవరిని ఇరికించమంటే వారిని ఇరికించడానికి సీబీఐ సిద్ధంగా ఉందన్న నమ్మకం కుదిరిందా?”
 
 
“జీఎస్‌టీ బకాయిల చెల్లింపు వంటి విషయాలలో రాష్ర్టానికి న్యాయం చేయాలని తెలంగాణ ఎంపీలు అదే పార్లమెంట్‌ ఆవరణలో నినదించగా, అమరావతి భూములపై సీబీఐ విచారణ కావాలని మాత్రమే వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తంచేయడం గమనార్హం. రాష్ర్టానికి సంబంధించి ఏ విషయంలో కూడా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం లేదని స్పష్టమవుతోంది.”
 
భళా….ఒక కేంద్రమంత్రి …ఎవరో పేరు గుర్తు రావడం లేదు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాతిక ముప్ఫయి సార్లు ఢిల్లీ వెళ్లారు. మంత్రులను, ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా జగన్ కేసులను తొందరగా విచారించి జైలుకు పంపించాలని మాత్రమే కోరేవాడు.  రాష్ట్ర సమస్యలను, ప్రత్యేకహోదా, పాకేజీ లాంటి విషయాలను ఎన్నడూ ప్రస్తావించలేదు” అంటూ ఒక ప్రకటన చేసేడు!  రాధాకృష్ణ మర్చిపోయి ఉంటాడు…ప్రత్యేకహోదా పేరుతో కేతిగాడి వేషాలు వేస్తూ నాడు తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి వానర చేష్టలు చేశారో జనం మర్చిపోలేదు.  బీజేపీతో మైత్రి ఉండీ కూడా చంద్రబాబు కేంద్రం నుంచి ఒక్క అనుమతిని కూడా సాధించలేక ప్రజలతో ఛీ కొట్టించుకున్నారు.  
 
****
” ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటే నష్టపోయినవాళ్లు ఫిర్యాదు చేస్తారు. అమరావతిలో భూములు అమ్ముకున్నవాళ్లు ఫిర్యాదు చేయలేదు. అధికార పార్టీ వాళ్లు అయినకాడికి తమ భూములు కొట్టేశారని ఒక్క రైతు కూడా చెప్పలేదు. అలాగే భూములు బలవంతంగా లాక్కున్నారన్న ఫిర్యాదులు కూడా లేవు. అయినా జగన్‌ అండ్‌ కోకు మాత్రమే అక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కనపడుతోంది. “
 
“ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి” అని ఆత్రేయ ఏ ముహూర్తంలో పాటను రాశారో కానీ, దాన్ని అక్షరసత్యం చేస్తున్నారు మన బాధాకృష్ణ!  నష్టపోయినవారు ఫిర్యాదు చేస్తారట!  భూములు కొట్టేశారని ఒక్క రైతు కూడా చెప్పలేదట!  మరి జగన్ మమ్మల్ని మోసం చేశాడని ఏ ఒక్క పారిశ్రామికవేత్త అయినా నాడు చెప్పాడా?  జగన్ వలన మాకు నష్టం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేశారా?  జగన్ మాకు డబ్బులు ఎగ్గొట్టాడని ఏ రైతు, ఏ వ్యాపారి అయినా కోర్టుకు ఎక్కాడా?  జగన్ మా మీద ఒత్తిడి తెచ్చాడని, మాతో బలవంతంగా అక్రమాలు చేయించాడని  ఏ ఒక్క అధికారి అయినా, ఏ ఒక్క మంత్రి అయినా ఫిర్యాదు చేశారా?   ఎవరూ ఫిర్యాదు చెయ్యకపోయినా, ఎవరూ కేసు పెట్టకపోయినా జగన్ మీద లక్ష కోట్ల ఆరోపణలు ఎలా చేసారు?  ఎలా వేధించారు?  జవాబు ఉన్నదా రాధాకృష్ణా? 
 
****
 
“మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం నాయకులు బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ వ్యూహాలను, ఎత్తుగడలను పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రతివ్యూహాలు రూపొందించుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమవుతోంది.”
 
అయ్యయ్యో….తెలుగుదేశం నాయకులు బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారట!  నవ్వండి బాబూ…రాధాకృష్ణ ఇంత ఎత్తున కితకితలు పెడుతున్నా పళ్ళు బయటపెట్టి నోరారా నవ్వరేమి?  మొత్తం ప్రముఖ నాయకులు అందరూ పీకలలోతు కుంభకోణాల్లో ఇరుక్కుని సతమతమైపోతుంటే ఇక నోళ్లు ఎలా విప్పుతారు?  తెలుగుదేశం హయాంలో పెత్తనం చెలాయించిన స్వాములు అందరూ కుంభకోణాల్లో ఇరుక్కుని కోట్లరూపాయలు కొల్లగొట్టారు.  వాళ్ళ నోళ్లు ఎలా తెరుచుకుంటాయి?  అయినా, పచ్చ కులగజ్జి ఛానెళ్లలో తెలుగుదేశం నాయకులకన్నా భయంకరంగా నోళ్లు తెరిచి అరిచే యాంఖరులు, కులగజ్జిని విబూది రెక్కల్లా ఒళ్ళంతా పూరేసుకుని విశ్లేషకులు  బోలెడుమంది ప్రతిరోజూ వీరంగాలు వేస్తూ, నోళ్లు పారేసుకుంటూ వినోదాన్ని పంచుతున్నపుడు ఇక వేరే తెలుగుదేశం నాయకులు దేనికి?  
 
 ****
High Court of Andhra Pradesh
 
“న్యాయ వ్యవస్థ నైతికస్థైర్యం దెబ్బతింటే ప్రజలకే నష్టం. పారాహుషార్‌! ఒకవైపు అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ, మరోవైపు న్యాయ వ్యవస్థనే బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకోవడం జగన్‌రెడ్డికే చెల్లుతుంది. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసి ఉండకపోతే తన పరిస్థితి ఏమై ఉండేదో జగన్‌ గుర్తు చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది!”
 
ఆహా…ఏమి నీతిని బోధించారో మన రాధాకృష్ణస్వాములవారు!  న్యాయవ్యవస్థ నైతిక ధైర్యం   దెబ్బతింటే  అది ఆ వ్యవస్థలోని  కొందరు  వ్యక్తులద్వారా  మాత్రమే సాధ్యం అవుతుంది.  న్యాయవ్యవస్థ మీద ఇప్పటికే బోలెడుమంది మేధావులు, రాజ్యాంగ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు చేశారు.  న్యాయవస్థ అవినీతిమయం అయిందని, ధనికులకు మాత్రమే సత్వర న్యాయం లభిస్తున్నదని ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారే కుండలు బద్దలు కొట్టారు.  న్యాయవ్యవస్థ స్థైర్యాన్ని దెబ్బతియ్యడానికి వేరే ఎవరూ పనిగట్టుకుని కృషి చెయ్యాల్సిన అవసరం లేదు.  ఇక బెయిల్ ఇవ్వకపోతే జగన్ పరిస్థితి ఏమయ్యేది అని ప్రశ్నిస్తూ జగన్ ను బ్లాక్ మెయిల్ చెయ్యాలని ప్రయత్నిస్తున్న రాధాకృష్ణ…బెయిల్ అనేది నిందితుడి రాజ్యాంగ హక్కు అని తెలుసుకోవడం మంచిది.  మనలో మాట…చంద్రబాబు మీద పద్దెనిమిది స్టేలను కోర్టులు గత ఇరవై ఏళ్లుగా కొనసాగించకపోతే చంద్రబాబు పరిస్థితి ఏమిటో చెప్పగలరా?  ఒక్క ఓటుకు నోటు కేసును విచారిస్తే చాలు…చంద్రబాబుకు కనీసం మూడేళ్లపాటు శ్రీకృష్ణజన్మస్థానంలో నివాసం ఉండటానికి!  
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు