మోడీ టేబుల్ మీద ‘జగన్ వైజాగ్’ కి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్

Modi and YS Jagan

అమరావతి:గతంలో అమరావతిని రాజధానిగా నియమించినప్పుడు ప్రధాని మోదీ అతిథిగా రాగా,అయితే అది ఇప్పుడు శాసన రాజధానిగా మారనుంది. తాజాగా రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. కొన్ని రోజుల్లో 3 రాజధానులు బిల్లుకు అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోతాయని, రానున్న విజయదశమికి నూతన రాజధానికి శంకుస్థాపన చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా విశాఖకు షిఫ్ట్ కానున్నాయని వైసీపీ నాయకులు చెప్తున్నారు.

అయితే రాజధాని శంకుస్థాపనకు జగన్ మాస్టర్ ప్లాన్ రచించారని తెలుస్తుంది. ఇప్పటివరకు భోగాపురంలో ప్రభుత్వం సేకరించిన 3000 ఎకరాల్లో 2500 ఎకరాలు మాత్రమే ఎయిర్ పోర్ట్ కోసం కేటాయించారు. మిగిలిన 500 ఎకరాల్లో రాజధాని శంకు స్థాపన చేయనున్నారని, దీనికీ కూడా ప్రధాని మోదీని జగన్ ఆహ్వానించనున్నారని ప్రచారం కొనసాగుతుంది.

ఈ రాజధాని వేడుకకు కూడా మోదీ వస్తే టీడీపీ నాయకులు షాక్ అవ్వాల్సిందే. గతంలో రాజధాని విషయంలో చంద్రబాబు మోదీని పక్కన పెట్టాడని, అందుకే మోదీ రాజధాని విషయంలో దూరంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వేడుకకు మోదీ వస్తే, జగన్ 3 రాజధానులు ప్లాన్ వెనక కూడా మోదీ ఉన్నారనే వార్తలు కూడా నిజం కానున్నాయి. మోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే మూడు రాజధానుల విషయంపై మోడీకి అభ్యంతరం లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయవచ్చని జగన్ పథకం రచించారు.

భోగాపురం మరో 1500 ఎకరాలు కొని, కాన్సెప్ట్ రాజధానిని నిర్మించాలని కూడా వైసీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారని, విశాఖలో ఏర్పాటు చేయనున్న మెట్రోను భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ దాకా కనెక్ట్ చేయనున్నారని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మూడు రాజధానుల ప్లాన్ తో జగన్ టీడీపీ నాయకుల అమరావతి కలలను నాశనం చేయనున్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించి, జగన్ తాను రచించిన ఈ ప్లాన్ లో మోదీని కూడా భాగం చేయనున్నారు. జగన్ ప్లాన్ కు బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.