లేచింది నిద్ర లేచింది దాంపత్య లోకం – దద్దరిల్లింది సాంప్రదాయ లోకం అని కొత్త పాటలు పాడుకోవాల్సిన రోజులు వచ్చేశాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే… మీరే అంటారు… అంతేగా – అంతేగా అని!
ఒక వ్యక్తి భార్యతో మరో వ్యక్తి పరారయ్యాడు. దీనికి ప్రతిగా ఆ మరోవ్యక్తి భార్యను ఆ ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అర్థమయ్యీ అర్థమవ్వనట్లున్నా… ఇది నిజం! అంటే… ఏ భార్యను.. బి తీసుకుని పోతే… బి భార్యను ఏ తీసుకుని పోయాడన్నమాట! ఈ విచిత్ర ఉదంతం బీహార్ లో చోటుచేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే… బీహార్ కి చెందిన ముఖేశ్.. నీరజ్ భార్యతో పరారయ్యాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ యవ్వారంపై గ్రామ పెద్దలు పంచాయితీ పెటారు. అయితే… తన ప్రియురాలు (నీరజ్ భార్య) ని వదిలి ఉండలేనని స్పష్టం చేశాడు. దీంతో పగ పెంచుకున్న బాధితుడు నీరజ్… ముఖేష్ భార్యతో పరిచయం పెంచుకుని, ఆమెను ఒప్పించి.. గుడిలో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరో విచిత్రం ఏమిటంటే… నీరజ్ కు అప్పటికే నలుగురు సంతానం ఉండగా, ముఖేశ్ కి ముగ్గురు సంతానం. ఇంకో విచిత్రం ఏమిటంటే… ముఖేశ్, నీరజ్ ల భార్యల పేర్లు ఒకటే! ఇద్దరి పేర్లూ “రూబీ”యే!
దీంతో… ఈ వ్యవహారం గురించి తెల్సినవారు… “విధి ఎంత విచిత్రం అయ్యింది”, “పేరులో ఏమున్నది – మనసులో దాగున్నది మొత్తం” అంటూ సెటైరికల్ కామెంట్లు పెడుతుండగా… ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన “మా ఆవిడ మీద ఒట్టు – మీ ఆవిడ చాల మంచిది” అనే సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. ఫలితంగా… వీరి ఏపీసోడ్ కి… “మా ఆవిడ మీద ఒట్టు.. మీ ఆవిడంటే చాలా ఇష్టం” అని టైటిల్ ఫిక్స్ చేస్తున్నారు!