Mukesh: డైరెక్టర్ ముఖేష్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ ముఖేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. కన్నప్ప అనేది మైథలాజీ కాదు.. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు.
కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర. దాన్నే మా చిత్రంలో చూపించాము. అలాగే నేను ఇంత వరకు బుల్లితెరపై చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. మహా భారతం సీరియల్ ను రూ. 200 కోట్లతో తీశాము. నాకు సినిమాలేమీ కొత్త కాదు. ఇది వరకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇంగ్లీష్ చిత్రాల్ని నిర్మించాను. నేను బుల్లితెరకు పని చేసినా, వెండితెరకు పని చేసినా ఒకే మైండ్ సెట్ తో పని చేస్తాను అని తెలిపారు. కన్నప్ప మూవీ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్, మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు,బ్రహ్మానందం ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి.
మోహన్ బాబు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్ గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు అని తెలిపారు. కన్నప్ప మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చూశాను. కన్నడ, తెలుగు, హిందీలో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ ముఖేష్.