Rosaiah : రోశయ్య అంత్యక్రియలకు జగన్ ఎందుకు హాజరుకాలేదు?

Rosaiah

కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కాదేదీ కవిత్వానికి అనర్హం అని గతంలో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విషయం కూడా రాజకీయం చేయడానికి అనర్హం కాదన్నట్టు వుంది పరిస్థితి.  తాజాగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు కాలం చేశారు. ఆయన అంత్యక్రియలకు ఎవరు వెళ్లారు ఎవరు వెళ్లలేదు అనేది కూడా రాజకీయానికి వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రోశయ్య గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు ముగ్గురు మంత్రులు హాజరై నివాళులర్పించారు.  అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని విమర్శించడానికి కాచుకు కూర్చునే  మీడియా సంస్థలు ఈ విషయం పై దీర్గాలు తీయడం  మొదలుపెట్టాయి.  రాజశేఖర్ రెడ్డికి రోశయ్య గారు ఎంతో సన్నిహితులని, అంత సాన్నిహిత్యం ఉన్న రోశయ్య గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి కనీసం అంత్యక్రియలకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు.  అంతటితో ఆగినా పర్వాలేదు, దాన్ని ఇంకా పొడిగిస్తూ  రోశయ్య కులాన్ని కూడా ఇందులోకి లాగారు. జగన్ వైశ్యుడైన  రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి  జగన్ అనేక ప్రయత్నాలు చేసి ఇప్పుడు కనీసం ఆయన చనిపోయిన తర్వాత అయినా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదని ప్రధాన మీడియాలోనూ మరియు సోషల్ మీడియాలోను  టిడిపి మరియు  వారి అనుబంధ సంస్థలు వారికి  తోచినట్లు రాసుకుంటూ, చెప్పుకుంటూ వెళ్తున్నారు

అయితే ఈ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి రోశయ్య పట్ల ఏ విధమైనటువంటి ద్వేషం కాని వైశ్య కులం పట్ల చిన్నచూపు కానీ లేనట్లు తెలుస్తోంది. ఆయన కొన్ని కారణాల చేత ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా మటుకు వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు అవడం అనేది పూర్తిగా తగ్గించేశారు. ఏదైనా హాజరైనప్పటికీ అవి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు అయితే మాత్రమే హాజరవుతున్నారు లేదా ప్రభుత్వ కార్యక్రమాల మీద వివిధ జిల్లాలకు వెళ్ళినప్పుడు పనిలోపనిగా తన ముఖ్యమైన అనుచరుల వ్యక్తిగత కార్యక్రమాలు ఉంటే హాజరవుతున్నారు.  

దీనికి ఒక కారణం లేకపోలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తన మీద జరుగుతున్న కేసుల విచారణకు వ్యక్తిగత మినహాయింపు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉన్నందువలన తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడం వారు అందుకు అంగీకరించడం జరుగుతుంది. కోర్టుల్లో తన ప్రభుత్వానికి ఈ మధ్యకాలంలో అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పరిస్థితుల్లో తాను రాష్ట్రవ్యాప్తంగా అనేక వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరై ఈ కోర్టులో మినహాయింపు కోరడం అంత సమంజసంగా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి కాకుండా తనకీ వ్యక్తిగతంగా  కోర్టు ద్వారా సమస్యలు చికాకులు తెచ్చి పెట్టుకోవడం ఇష్టం లేని వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని కేవలం తన క్యాంప్ ఆఫీస్ కి లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు.   

అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి వైస్ జగన్ త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జ్ఞాపకార్థం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక మంచి కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది

Rosaiah funeral