‘ఆంధ్రప్రదేశ్‌ని తొక్కేశాం..’ అని కేసీఆర్ నిజంగానే అన్నారా.? అన్నారో లేదోగానీ.. అలా ప్రొజెక్ట్ అయిపోయిందిప్పుడు వ్యవహారం. వరి పంట విషయంలో ఆంధ్రప్రదేశ్ కంటే చాలా ఉన్నతమైన పొజిషన్‌లో తెలంగాణ వుందనే విషయాన్ని చెప్పే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట తూలారు. ‘ఆంధ్రప్రదేశ్‌ని కిందకు తోసేశాం..’ అని అన్నారాయన. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ పట్ల కేసీఆర్ ‘దుందుడుకు వైఖరి’ ఇదే కొత్త కాదు. అయినాగానీ, గత గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టారు ఓటర్లు. మరి, ఇప్పుడేమవుతుంది.?
రోజులు మారాయ్.. ఈక్వేషన్లూ మారాయ్.!
గడచిన గ్రేటర్ ఎన్నికలకీ.. ఇప్పటి గ్రేటర్ ఎన్నికలకీ కొంత తేడా వుంది. గ్రేటర్ పరిధిలో ఆంధ్రోళ్ళ పట్ల కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా ‘వ్యతిరేకత’ చూపలేదు. ‘తెలంగాణ – ఆంధ్రా’ అన్న భావన కూడా కనిపించలేదు. ఈ విషయంలో కేసీఆర్ అండ్ టీంని మెచ్చుకోవాల్సిందే. ‘తెలంగాణలో వున్నోళ్ళంతా తెలంగాణోల్లే..’ అని టీఆర్‌ఎస్ నేతలు చెప్పారు.. అలాగే వ్యవహరించారు కూడా. కానీ, ఎన్నికల సమయంలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన’ అవసరమా.? పైగా, ‘కిందికి తోసేశాం’ అనడం సబబా.? ఒక్క మాటతో ఈక్వేషన్ మారిపోయింది.

ఆంధ్రా ఓట్లు ఎటువైపు వెళతాయ్.?
గ్రేటర్ పరిధిలో ఆంధ్రా ఓటర్లు ఆయా స్థానాల్లో కీలక భూమిక పోషిస్తారన్నది నిర్వివాదాంశం. కేసీఆర్ ఏదో అన్నారని, వున్న పళంగా కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఓట్లు గుద్దే పరిస్థితి వుంటుందా.? లేదా.? అన్నదానిపై టీఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన బయల్దేరింది. ‘కేసీఆర్ ఉద్దేశ్యం అది కాదు..’ అంటూ టీఆర్‌ఎస్ నేతలు వివరించుకోవాల్సి వస్తోంది. పోటీ చాలా తీవ్రంగా వుంది.. చాలా తక్కువ ఓట్లు ఫలితాన్ని మార్చేస్తాయి. దాంతో, ఆంధ్రా ఓటర్లను బుజ్జగించే ప్రయత్నాలు బీభత్సంగా జరుగుతున్నాయి.
ఇదిలా వుంటే, వైసీపీ ఓటు బ్యాంకులో కొంత బీజేపీ వైపు, ఇంకొంత టీఆర్‌ఎస్ వైపు వెళుతుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఓటు బ్యాంకు విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ఏదిఏమైనా, ‘ఆంధ్రప్రదేశ్‌ని కిందికి తోసేశాం..’ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో కొంత ప్రభావమైతే చూపే అవకాశం లేదన్నమాట.