అమెరికాలో నివసిస్తూ భారతదేశంలోని కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్న ఎన్నారైలకు ఇది ఊహించని పరిణామం. అమెరికా రిపబ్లికన్ సభ్యులు ప్రవేశపెట్టిన ఓ కొత్త చట్ట ముసాయిదా విదేశాలకు డబ్బు పంపే వారిపై 5% అదనపు పన్ను విధించాలన్నదే అసలు ఉద్దేశం. ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరుతో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇది చట్టంగా మారితే జూలై 4వ తేదీ నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా, హెచ్-1బీ, ఎఫ్-1, జె-1 వీసాలపై ఉన్నవారు, గ్రీన్ కార్డ్ దారులు, ఇంకా పౌరసత్వం పొందని ఇతరులు ఈ పన్ను పరిధిలోకి రానున్నారు. ఇలా చట్టం అమలవితే విదేశాలకు డబ్బు పంపించే ప్రతీసారి, పంపిన మొత్తంపై అదనంగా 5% చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు లక్ష రూపాయలు పంపితే, అదనంగా ఐదు వేల రూపాయలు పన్ను కింద పోతాయి.
రెమిటెన్స్ ప్రొవైడర్లు ఈ పన్నును వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అయితే అమెరికా పౌరులు మాత్రం ఈ కొత్త విధానానికి మినహాయింపు పొందగలుగుతారు. కానీ అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రొవైడర్ ద్వారా మాత్రమే.
ప్రభావితయ్యే అంశాలు చాలా ఉన్నాయి. భారతదేశానికి విదేశీ మారకద్రవ్య రాక ప్రభావితం కావచ్చు. నిత్యం కుటుంబ ఖర్చులు, విద్య, వైద్యం కోసం అయిన ఎన్నారై డబ్బుల రాకలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది రూపాయి మారక విలువను కూడా దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 45 లక్షల మంది భారతీయులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన చట్టంగా మారాలంటే అమెరికా కాంగ్రెస్‌లో రెండు సభల ఆమోదం కావాలి. కానీ ఇప్పట్లో ఇది తెచ్చే ఊహాగానాలు ఎన్నారైలలో ఆందోళన కలిగిస్తున్నాయి.