వైఎస్ భారతిని వాడుకోలేకపోయిన శ్రీదేవి!

తెలిసి చేశారో.. తెలియక చేశారో.. తెలియదు కానీ…. రాజకీయంగా తనగోతిని తానే తవ్వుకున్నారు ఉండవల్లి శ్రీదేవి. వచ్చిన అవకాశాన్ని, ఉన్న పరిచయాల్ని సక్రమంగా వాడుకోవడంలో సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అయ్యారు. ఫలితంగా రాజకీయ భవిష్యత్తును అందకారంలోకి నెట్టేసుకున్నారు. అలా వచ్చి ఇలా పోయిన శ్రీదేవి రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాం.

డాక్టర్ గా ఫుల్ బిజీగా ఉండే శ్రీదేవి తాను రాజకీయాల్లోకి వస్తానని ఊహించి ఉండరు. ఆమెకు అసలు ఆ ఆలోచనే ఉండి ఉండదు. కానీ… వైఎస్ భారతితో పరిచయం డాక్టర్ గా ఉన్న ఆమె జీవితాన్ని రాజకీయ నాయకురాలిగా మార్చింది. భారతి సిఫార్సుతో ఆమెకు తాడేపల్లి టిక్కెట్ దక్కింది! 2019లో వీచిన బలమైన ఫ్యాన్ గాలులతో పొలిటికల్ కెరీర్ లో తొలి అడుగులోనే విజయం వరించింది. ఇది అతితక్కువమందికి దక్కే అవకాశం.

అయితే… ఆ అరుదైన అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవడంలో శ్రీదేవి ఫెయిల్ అయ్యారు. తాడికొండ నియోజకవర్గంలో వర్గ పోరుకు తెరతీశారు. నియోజకవర్గంలో కేడర్ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యారు. ఈ సమయంలో అయినా… జగన్ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ని వాడుకుని అయినా.. సమస్యలు చక్కదిద్దుకోలేకపోయారు.

ఫలితంగా… నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమవుతుందో అని గ్రహించిన అధిష్టాణం… డొక్కా మాణిక్యవరప్రసాద్ ను సమన్వయ కర్తగా నియమించింది. అంటే… పరోక్షంగా శ్రీదేవికి చెక్ పెట్టింది. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డొక్కా పేరు లేకపోవడంతో… ఇక వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు లేదనే విషయం చెప్పకనే చెప్పింది. దీంతో… శ్రీదేవి పొలిటికల్ కెరీర్ పై నీలినీడలు కమ్ముకోవడం మొదలయ్యాయి.

అప్పటికీ మునిగిపోయిందేమీ లేదు. ఇకనుంచైనా కాస్త చాకచక్యంగా మసులుకుంటూ – వైఎస్ భారతితో ఉన్న రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తే… భవిష్యాతులో ఏ నామినేటెద్ పోస్టుకో – ఎమ్మెల్సీకో ఎంపికయ్యే అవకాశాలుండేవి. కానీ ఇంతలోనే ఒక తుత్తర నిర్ణయం తీసుకున్నా శ్రీదేవి… క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు. దీంతో… ఆమెపేరు చెబితేనే వైకాపా కార్యకర్తలు అంతెత్తున లేస్తున్నారు. ఇప్పటికే ఆమె కార్యలయంపై దాడులు చేశారు.

పోనీలే క్రాస్ ఓటు వేశినందుకు టీడీపీ అయినా అక్కున చేర్చుకుంటుందిలే అనుకుంటే.. అక్కడ ఇప్పటికే పాతుకుపోయిన తెనాలి శ్రావణ్ కుమార్ ఉండనే ఉన్నారు. దీంతో ఏ రకంగానూ ఇక ఆమె పొలిటికల్ కెరీర్ కు మార్గం కనిపించకుండా.. మూసుకుపోయే స్థితికి వచ్చేసిందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈమె పొలిటికల్ కెరీర్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయే పరిస్థితికి కారణం.. స్వయంకృతాపరాధం మాత్రమే!