సోము వీర్రాజుకు బిజెపి అధ్యక్ష పదవి ముళ్ల కిరీటమే!

Somu Veeraju

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొంటే ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపికి ఎవరు నాయకత్వం వహించినా ఒకటే! ఇప్పుడు సోము వీర్రాజు వచ్చి పెద్దగా సాధించేదేమీ వుండదు. కన్నా లక్ష్మీనారాయణ సాధించింది అంత కన్నా లేదు. ఆంధ ప్రదేశ్ లో బిజెపి భావ జాలానికి ఏమాత్రం ప్రాతిపదిక లేదు. హిందుత్వ వాదానికి సామాజిక రాజకీయ పునాది ఎపిలో లేదు. మత ప్రాతిపదికనే బిజెపి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో సామాజిక ప్రాతిపదిక ఎంతో కొంత వుంది కాబట్టి అటూ ఇటూ గా ఉనికిలో వుంది.

Read More : మాట‌ల్లో ముళ్ల‌పూడి త‌ర్వాత రావి కొండ‌ల‌రావే

2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేల మట్టమైన పూర్వ రంగంలో ఆ రాజకీయ శూన్యత భర్తీ చేస్తామని బిజెపి నేతలు కలలు గన్నారు. ఏమైందీ అందరికీ తెలుసు. తిరిగి 2019 ఎన్నికల తర్వాత టిడిపి శాసన సభ్యులు గంప గుత్తగా బిజెపిలోనికి వస్తున్నారని శాసన సభలో తాము ప్రతి పక్షం కాబోతున్నామని ఇప్పుడు అధ్యక్ష పదవి చేపట్టనున్న సోము వీర్రాజు ప్రకటన చేశారు. తుదకు ఏమైందీ చెప్ప పనిలేదు. ఈ పరిస్థితి రెండు దఫాలు ఏర్పడటానికి కారణం ఒకటే. ఆంధ్ర ప్రదేశ్ లోని ఓటర్లు బిజెపి భావజాలానికి ఏమాత్రం ఆకర్షితులు కాక పోవడమే అందువలన క్రియాశీలక మైన నేతలు బిజెపి వేపు మొగ్గడం లేదు. బిజెపి కేంద్రంలో అధికారంలో వున్నా అప్పుడు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు టిడిపి నేతలు ఆ వేపు మొగ్గు చూపలేదంటే ఓటర్లను మెప్పించ లేమనే భయంతో తప్ప వేరు కాదు.

మూడు రాజధానుల‌పై కొత్త సార‌థి కామెంట్ ఇది

ఈ పూర్వ రంగంలో కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు వచ్చినా సాధించేదేమీ లేదు. సోము వీర్రాజు టిడిపి సహకారంతో ఎమ్మెల్సీ పదవి పొందినా తొలి నుండి టిడిపి వ్యతిరేక వైఖరి కలిగి వున్నారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని వున్నంత కాలం రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల సాధ్యం కాదనే వైఖరి వ్యక్తం చేసి వున్నారు. ఇందుకు ప్రాతిపదిక వుంది. సోము వీర్రాజు స్వతహాగా ఆర్ యస్ యస్ భావజాలంతో రాజకీయంగా ఎదిగిన నేత.

Read More : మూడు రాజధానుల‌పై కొత్త సార‌థి కామెంట్ ఇది

ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి సోము వీర్రాజుకు ముళ్ల కిరీటమే. గతంలో వున్న టిడిపి వ్యతిరేకత అట్టే పెట్టుకొని వైకాపాతో మైత్రిగా వుండి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం సాధ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు ఎంతో నయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలపై కేంద్రంలో బిజెపి అధికారంలో వున్నా బిజెపి కార్యకర్తలపై కూడా దాడులు జరుగుతున్నాయి. వాస్తవంలో రాష్ట్రంలో టిడిపి వైకాపా కన్నా బిజెపి వైకాపా మధ్య తారాస్థాయికి వైషమ్యాలు చేరాయి. దాదాపు వైకాపా ప్రభుత్వం గైకొంటున్న అన్ని విధానాలను బిజెపి అన్ని పార్టీల కన్నా ముందుండి పోరాడుతోంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయాడని బిజెపికి కొత్త నాయకత్వం వస్తోందని వైకాపా నేతలు ప్రకటనలు చేశారు. అంత వరకు బాగానే వుంది. కొత్త నాయకత్వం వచ్చింది. ఈ కొత్త నాయకత్వం ఇంతకు మునుపు వైకాపాకు వ్యతిరేకంగా చేపట్టిన విధానాలను తిరగ తోడుతుందా?

బీజేపీ కొత్త కేప్టెన్ పై జ‌న‌సేనాని అభిప్రాయం ఏంటి?

ఉదాహరణకు అమరావతి రాజధాని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదం పలు కీలక మైన అంశాల్లో కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టబోయే సోము వీర్రాజు తిరగ తోడు తారా? అదే జరిగితే ఇప్పుడున్నట్లుగానైనా బిజెపి రాష్ట్రంలో ఉనికి కాపాడుకోగలుతుందా? ఇవన్నీ అటుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఈ పాటికే బెడిసి పోయి వుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి నిర్మల సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు వేసి వాతావరణం వేడెక్కించి వున్నారు. వీటన్నింటి మించి జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని అంశంలో మాట తీసుకొనే బిజెపితో జట్టు గట్టినట్లు ప్రకటించి వున్నారు. అందరూ ఊహించుతున్నట్లు బిజెపి జాతీయ నాయకుల్లో కొందరు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించి అదే దారిలో సోము వీర్రాజు తొక్కితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి ఒక ప్రతి పక్ష పార్టీగా అటుంచి ఒక రాజకీయ పార్టీగా కూడా ఉనికి నిలుపుకో గలగుతుందా? .

Read More : క‌ల‌ల్లోంచి క‌ల‌ల్లోకి వెళ్లి దొంగ‌త‌నం చేసిన ఏకైక‌ హీరో!

వైకాపా నేతలు ఊహించినట్లు రాష్ట్ర బిజెపికి కొత్త సారధి వచ్చినా ఇప్పుడున్న విధానాలను అవలంభించితే వైకాపాకు చెంది తలకు కొట్టుకోవడానికి ఏ రాయి అయినా ఒకటే అవుతుంది. లేదా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం చేపట్టే ప్రభుత్వ వ్యతిరేక విధానాల యెడల తటస్థ వైఖరి లేదా వ్యతిరేక వైఖరి అవలంభించితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి దుకాణం కట్టి వేయ వలసి వుంటుంది అంతే కాదు. రాష్ట్రంలోని బిజెపి నేతలు ఒక తాటిపై నడిచే అవకాశం వుండక పోవచ్చు.

వైకాపా వర్సెస్ బిజెపి పోరు ఎవరికి లాభిస్తుంది?

న్యాయస్థానాల తీర్పులు అమలులో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వుంటోంది. ఇంత వరకు టిడిపితో పాటు బిజెపి జనసేన తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పుడు సోము వీర్రాజు ఏ వైఖరి తీసుకుంటారు? గత నాయకత్వం అవలంభించినట్లు ముందుకు పోతారా వైకాపాకు అనుకూలంగా వుంటారా? అందుకే సోము వీర్రాజు అధ్యక్ష పదవి ముళ్ల కిరీటమే

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013