Tooth Brush: మీ టూత్ బ్రష్ మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుతోందా..? సరైన మార్చకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

మీ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కోసం రోజూ టూత్ బ్రష్‌తో శుభ్రం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ఉపయోగిస్తున్న టూత్ బ్రష్‌ను సరైన సమయంలో మార్చడం కూడా అంతే ముఖ్యమని తెలుసా.. చాలామంది ఈ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు.. కానీ దంతవైద్యులు హెచ్చరిస్తున్నారు.. పాత బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే అది మీ నోటి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. టూత్ బ్రష్ కేవలం శుభ్రపరిచే సాధనం మాత్రమే కాదు.. అది మీ చిరునవ్వును, ఆరోగ్యాన్ని కాపాడే కీలక అస్త్రం. సరైన సమయంలో బ్రష్ మార్చకపోతే, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు మీ నోటిలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఈ చిన్న అలవాటు మీ దంతాలు, చిగుళ్లను రక్షించడంతో పాటు.. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

టూత్ బ్రష్‌ను మార్చడం ఎందుకు అంత ముఖ్యం.. సమయం గడిచే కొద్దీ బ్రష్ ముళ్ళగరికెలు (బ్రిస్టల్స్) అరిగిపోతాయి, బ్యాక్టీరియా, ఫంగస్‌లు చేరతాయి. ఈ క్రిములు నోటిలోకి చేరితే చిగుళ్ల వాపు, దంతక్షయం, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొత్త బ్రష్‌లో ఉండే గట్టి, తాజా బ్రిస్టల్స్ దంతాల మధ్య, చిగుళ్ల రేఖ వద్ద పేరురుకుపోయిన ఫలకం (ప్లాక్), ఆహార కణాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. పాత బ్రష్ బ్రిస్టల్స్ అరిగిపోతే, అవి ఈ పనిని సరిగా చేయలేవు మరియు చిగుళ్లను గాయపరచవచ్చు. ఇది చిగుళ్ల వ్యాధులు, రక్తస్రావం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక కొత్త బ్రష్ మీ దంతాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతూ దీర్ఘకాలంలో దంతవైద్య ఖర్చులను కూడా తగ్గిస్తుంది.

దంతవైద్యుల సలహా ప్రకారం, సాధారణంగా ప్రతి 3-4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలి. అయితే, కొన్ని సందర్భాల్లో మీరు దీన్ని ముందుగానే మార్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు, జలుబు, దగ్గు లేదా నోటి ఇన్ఫెక్షన్ తర్వాత పాత బ్రష్‌ను వాడితే, క్రిములు మళ్లీ ఇన్ఫెక్షన్‌ను పునరావృతం చేయవచ్చు. అలాగే, బ్రష్ ముళ్ళగరికెలు వంగిపోయి, అరిగిపోయినట్లు కనిపిస్తే, అది శుభ్రం చేయడంలో విఫలమవుతుంది, కాబట్టి వెంటనే మార్చడం మంచిది. పిల్లల టూత్ బ్రష్‌ల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు గట్టిగా బ్రష్ చేయడం వల్ల బ్రిస్టల్స్ త్వరగా చెడిపోతాయి. ఎలక్ట్రిక్ బ్రష్ వాడేవారు కూడా దాని హెడ్‌ను 3-4 నెలలకు ఒకసారి మార్చాలి.

టూత్ బ్రష్ శుభ్రత కూడా అంతే ముఖ్యం. ప్రతి ఉపయోగం తర్వాత బ్రష్‌ను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. దాన్ని నిటారుగా నిలబెట్టి, బ్రిస్టల్స్ త్వరగా ఆరేలా చూడాలి. మూసి ఉన్న పెట్టెలో బ్రష్‌ను నిల్వ చేయడం మానుకోవాలి, ఎందుకంటే తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం – మీ బ్రష్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు, ఎందుకంటే ఇది క్రిములను సులభంగా వ్యాపింపజేస్తుంది. మీ టూత్ బ్రష్‌ను శుభ్రంగా ఉంచడం, సరైన సమయంలో మార్చడం వల్ల దంతక్ష ప్రమాదం ఉంది.