కర్నాటకలో ఆ మూడు ఓట్లూ బీజేపీకే.!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడు ఓట్లు అయితే పక్కాగా భారతీయ జనతా పార్టీకి పడబోతున్నాయి. మూడు ఓట్లు.. అంటే, కేవలం మూడు ఓట్లు మాత్రమే కాదు.. మూడు వందలు.. ముడు వేలు.. కాదు కాదు.. మూడు లక్షలు.. అంతకు పైన.!

ఇంతకీ, ఆ ‘మూడు’ ఓట్లు ఏంటి.? విషయం సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ.. బీజేపీకి తెరవెనుకాల మిత్రపక్షంగానే వ్యవహరిస్తున్నాయి. జనసేన పార్టీ ఎటూ బీజేపీకి మిత్రపక్షమే.!

కర్నాటకలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెలుగు ఓటర్లు, ఫలితాల్ని శాసించే స్థాయిలో వున్నారు. అలాంటి ఓట్లన్నీ దాదాపుగా బీజేపీకే పడబోతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారులు ఎక్కువ. ఇంకొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మద్దతుదారులెక్కువ. జనసేన సంగతి సరే సరి.!

సినిమా గ్లామర్ పరంగా చూసుకున్నా, తెలుగు సినీ నటుల్ని అభిమానించే కన్నడ ఓటర్లలో చాలామంది బీజేపీకి అనుకూలంగా ఓటేసే అవకాశం వుందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి.

కొన్నాళ్ళ క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకి వచ్చినప్పుడు సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్‌తో భేటీ అయిన విషయం గుర్తుంది కదా.? అది కూడా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వేసిన ముందస్తు ఎత్తుగడ అట.!

కర్నాటకలో తెలుగోళ్ళు బీజేపీకి ఓట్లేస్తారు సరే, ఏపీలోనో.? ప్చ్.. ఆ ఛాన్సే వుండదు ఆంధ్రప్రదేశ్ విషయంలో.! అదే మ్యాజిక్కు మరి.!