కవిత అరెస్ట్ ఆపేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్ ఇదే!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇప్పటివరకూ మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాలుగోసారి ఎప్పుడు రావాలన్నది ఈడీ మెయిల్ ద్వారా తెలియజేస్తారని చెప్పినట్లు సమాచారం. దీంతో… ఈనె 27న సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానున్న సందర్భంగా.. ఈడీ తనను మళ్లీ ఎప్పుడు పిలుస్తారనే విషయంలో కవిత ఒకింత టెన్షన్ లో ఉన్నారని తెలుస్తుంది. దీంతో… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఎదురుకాబోయే పరిణామాలు, వాటిని నివారించడానికి ఉన్న మార్గాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

ఇప్పటికే జరిగిన మూడు విచారణల్లో కవిత నుంచి రాబట్టాల్సిన సమాచారం గరిష్టంగా తీసుకున్నట్లు భావిస్తున్న తరుణంలో… ఈడీ మళ్లీ పిలిస్తే ఆరోజు కవితను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారని అంటున్నారు. అందులో భాగంగా… న్యాయపరమైన అవకాశాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారట. ఇప్పటికే న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్న ఆయన.. తాజాగా ఈడీ – సీబీఐ వంటి సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన అధికారులతోనూ చర్చించినట్టు తెలిసింది.

కవితను మళ్లీ విచారణకు పిలవనున్నట్టు ఈడీ ఇప్పటికే స్పష్టత ఇచ్చినా.. ఇంకా తేదీని ఖరారు చేయకపోవడంతో ఇకపైన ఎలాంటి అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టే చాన్స్ ఉందనే అంచనా వేసి.. దానిని ఎలా ఎదుర్కోవాలనే దానిపైనా సదరు రిటైర్డ్ అధికారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారట కేసీఆర్. ఒకవేల కవితను అరెస్టు చేయడం లాంటి నిర్ణయం జరిగితే లీగల్‌ గా ఎలా ప్రిపేర్ కావాలనే దానిపైనా ఆయన ఆరా తీసినట్టు సమాచారం. అరెస్టు వరకూ వెళ్లకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలు, లాజిక్ గురించి ఆ రిటైర్డ్ అధికారి అనుభవం ద్వారా కొన్నింటిని కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది.

ఈ క్రమంలో… ప్రగతిభవన్‌ లో రోజంతా చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఇలా.. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జీలు, న్యాయ నిపుణులు తదితరుల నుంచి అన్ని విధాలుగా సలహాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగు వేయాలని కేసీఅర్ భావిస్తున్నారట. అయితే ఇప్పటికే ఢిల్లీలో న్యాయనిపుణులతో కవిత, కేటీఆర్, హరీష్ రావులు చర్చించిన కారణంగానే… మూడు దఫాలుగా విచారణకు హాజరైనా కూడా ఆమెను అరెస్టు కాకుండా చూసుకోవడంలో సక్సెస్ అవ్వడానికి ఈ సలహాలే ప్లస్ అయ్యాయని తెలుస్తుంది.

మరి రేపు కవిత ఫిటిషన్ సుప్రీం లో విచారణకు వస్తున్న తరుణంలో… ఆ తీర్పు – దానికి కౌంటర్ గా ఈడీ వివరణల అనంతరం రాబోయే తీర్పు కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. ఫలితంగా ఈడీ నెక్స్ట్ స్టెప్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో… మేటర్ సీరియస్ అవుతుందని గ్రహించిన కేసీఆర్… ఈ రేంజ్ లో బిగ్ స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు!