అసలే మంత్రిగారి పెళ్లి… మామూలు వారి పెళ్లి అయితేనే ఆర్బాటాలు చేసే ఈ రోజుల్లో మంత్రిగారి పెళ్ళి అంటే మామూలు విషయమా. రాష్ట్రమంతా తరలి వచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి. ఆ మంత్రిగారు కూడా తన పెళ్లికి తన హోదాకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆవిడే ఏపి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ… ఇంతకీ మంత్రిగారి పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…
దివంగత నేతలు భూమా శోభా నాగిరెడ్డిల కూతురు భూమా అఖిలప్రియ. ప్రస్తుతం ఏపి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అఖిల ప్రియ పెళ్లి ఏర్పాట్లపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల ప్రియ తన పెళ్లికి అతిథులను ఆహ్వానించేందుకు ఓ లారీ నిండా శుభలేఖలు ప్రచురించిందట. దాదాపు 30 వేల పత్రికలు ప్రచురించారని తెలుప్తోంది. ఎక్కువగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా పంచేందుకు అఖిల ప్రియ నిర్ణయించారట. అఖిల ప్రియ పెళ్లి కార్డులు కింద ఉన్నాయి చూడండి.
మున్సిపల్ మంత్రి పి.నారాయణకు సమీప బంధువైన భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం ఈ నెల 29న కర్నూలు లోని శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో జరగనుంది. ఈ వివాహ వేడుకకు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో తెలంగాణ మంత్రులు, పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది.
అఖిల ప్రియ తన వివాహానికి హాజరు కావాలని నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబాన్ని పిలుస్తున్నారట. వారిని పిలిచి వారికి విందు భోజనం పెట్టి తన ఆత్మీయతను చాటుకోవాలనుకుంటున్నారని నేతలంటున్నారు. అయితే ప్రతిపక్షాల వారు మాత్రం దీనిని రాజకీయం అంటున్నారు. పెళ్లి పేరున తన ఓటు బ్యాంకింగ్ పెంచుకునేందుకే అఖిల ప్రియ అందరిని పిలిచి పార్టీ ఇస్తున్నారని వారంటున్నారు. ఏదేమైనా అఖిల ప్రియ పెళ్లి భారీ స్థాయిలో జరగబోతుంది.