Bhuma Family: భూమా కుటుంబంలో ఏం జరుగుతోంది… అక్క చెల్లెల భేటీ వెనక ఆంతర్యం ఏంటి?

Bhuma Family: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో రాజకీయ నేపథ్యపు ఉన్న ఫ్యామిలీలలో భూమా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ కుటుంబానికి ఎంతో మంచి రాజకీయ నేపథ్యం ఉంది భూమా నాగిరెడ్డి శోభ నాగిరెడ్డి ఇద్దరు కూడా రాజకీయాలలో ఎంతో ఉన్నత పదవులు అధిరోహించారు అయితే దురదృష్టవశాత్తు వీరిద్దరు కూడా కొన్ని కారణాలవల్ల మరణించడంతో ఒక్కసారిగా భూమా పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఇక శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన వారసురాలు భూమా అఖిలప్రియ ఏకంగా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ప్రస్తుతం అదే పార్టీలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.

ఇలా తల్లిదండ్రుల మరణం తర్వాత భూమా కుటుంబంలో కూడా ఆస్తి వివాదాలు చోటు చేసుకున్నాయని వార్తలు గతంలో బయటకు వచ్చాయి. భూమా మౌనిక సంతకాలను అఖిల ప్రియ ఫోర్జరీ చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా వీరిమధ్య ఆస్తి వివాదాలకు ఉన్న నేపథ్యంలో అక్క చెల్లెల మధ్య మాటలు కూడా లేవని తెలుస్తోంది. గతంలో తన తండ్రి, తల్లి జయంతి, వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డకు రాగ మౌనిక మాత్రం తన తల్లిదండ్రులకు నివాళులు అర్పించి వెళ్లేది కానీ తన అక్క అఖిల ప్రియతో మాట్లాడేది కాదు.

ఇకపోతే తాజాగా శోభ నాగిరెడ్డి జయంతి సందర్భంగా మనోజ్ దంపతులు, హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు చేరుకొని శోభ నాగిరెడ్డికి నివాళులు అర్పించారు అనంతరం ఇంటికి చేరుకోగా అఖిల ప్రియ అధికారిక సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇంటికి వెళ్లారు. అయితే ఈ అక్క చెల్లెలు గతంలో ఎదురుపడిన మాట్లాడుకోలేదు కానీ ఈసారి మాత్రం కొన్ని గంటల తరబడి సమావేశాలలో పాల్గొన్నారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశాల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ప్రస్తుతం చర్చలకు కారణమైంది.

మనోజ్ కుటుంబంలో కూడా వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మౌనిక అఖిలప్రియ ఆస్తి విషయాలను ఇలా సామరస్యంగా పరిష్కరించుకొని ఆలోచనలు ఉన్నారని అదే విషయం గురించి వీరిద్దరూ భేటీ అయ్యే సుదీర్ఘమైన చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే ఇటీవల మంచి కుటుంబంలో చోటు చేసుకున్న గొడవ గురించి మాత్రం అఖిల ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. దీంతో అసలు భూమా కుటుంబంలో కూడా ఏం జరుగుతోంది అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు

భూమా కుటుంబంలో ఏం జరుగుతుంది..? | Off The Record | NTV