Manchu Manoj: గత కొంతకాలంగా మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసిందే. అయితే ఈ గొడవలు నేపథ్యంలో తనకంటూ ఎంతో బలం ఉండాలని ఆకాంక్షించిన మంచు మనోజ్ రాజకీయాలలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన భార్య భూమా మౌనిక రెడ్డి కుటుంబానికి ఎంతో మంచి రాజకీయ నేపథ్యం ఉంది ఈ క్రమంలోనే ఈయన కూడా రాజకీయాలలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన పొలిటికల్ ఎంట్రీ పై ప్రకటన ఇవ్వబోతున్నారు అంటూ సోమవారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా వార్తలలో కూడా చక్కర్లు కొట్టింది.
ఇక డిసెంబర్ 16వ తేదీ దివంగత నేత శోభ నాగిరెడ్డి జయంతి కావడంతో భూమా మౌనిక మనోజ్ దంపతులు ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఇలా ఆళ్లగడ్డలో శోభ నాగిరెడ్డి ఘాట్ వద్ద వారు శోభ నాగిరెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం మనోజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలోనే మీడియా వారి నుంచి జనసేన పార్టీలోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం అనే ప్రశ్న వేశారు.
ఇప్పటికే భూమా మౌనిక రెడ్డి సోదరి భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో గత కొంతకాలంగా ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి మనోజ్ జనసేనలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే విషయంపై ప్రశ్నలు ఎదురవడంతో మనోజ్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
రాజకీయాలలోకి రావడం గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురవడంతో ప్రస్తుతానికి తానేమి మాట్లాడలేనని సమాధానం ఇచ్చారు. దీంతో ఈయన ఇప్పుడు కాకపోయినా త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారని మాత్రం స్పష్టం అవుతుంది. ఈరోజు మా అత్తయ్య శోభ నాగిరెడ్డి గారి జయంతి అందుకోసమే మేము ఇక్కడికి మొదటిసారి నా కూతురు దేవసేన శోభను తీసుకొని వచ్చాము. అత్తయ్య జయంతి రోజే తనని ఇక్కడికి తీసుకురావాలని భావించాము అందుకే ఇన్ని రోజులు తీసుకు రాలేకపోయామని తెలిపారు.
నా కుటుంబం సోదరులు బంధువులతో కలిసి ఇక్కడికి వచ్చానని ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారని తెలిపారు. ఇక నా కోసం రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా చూసుకున్నారు అంటూ మనోజ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేనని చెప్పడంతో ఈయన ఇప్పుడు కాకపోయినా ఆలస్యంగా అయినా కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలోనే ఉన్నారని స్పష్టమవుతుంది.