జస్టిస్ రాకేష్ కుమార్ కు తీవ్రమైన షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు 

The Supreme Court has given a serious shock to Justice Rakesh Kumar
జడ్జీలపైనే అనుమానాలా అంటూ జస్టిస్ రాకేష్ కుమార్ తీవ్రంగా ఆక్రోశించారు అంటూ ఈరోజు కొన్ని చంద్రబాబు బానిస పత్రికలు బోలెడంత నిర్వేదం ప్రకటించాయి.  జడ్జీలను బెదిరిస్తున్నారు అంటూ రాకేష్ కుమార్ తెగ బాధపడిపోయారు అంటూ ఆ రెండు క్షుద్రపత్రికలు రక్తాశ్రువులు రాల్చాయి.  

The Supreme Court has given a serious shock to Justice Rakesh Kumar

మరో పదిరోజుల్లో పదవీవిరమణ చేసి స్వరాష్ట్రం వెళ్లిపోయే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ నిర్వాకం పట్ల ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆయన్ను జీవితాంతం కుమిలిపోయేట్లు చేస్తాయి అనడంలో సందేహం లేదు.  ప్రభుత్వ న్యాయవాదుల ప్రార్థనలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించి రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిత్తి జరిగిందో లేదో తెలుస్తానని వీరంగం వేసిన రాకేష్ కుమార్ ను తన వ్యాఖ్యల ద్వారా సుప్రీమ్ కోర్ట్ తీవ్రంగా తప్పు పట్టింది.  రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిత్తి జరిగిందో లేదో నిర్ణయించాల్సింది రాష్ట్రపతి తప్ప కోర్టులు కావని సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.  అంతే కాకుండా, జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పు మాకు దిగ్బ్రాంతి కలిగించిందని, గత ముప్ఫయి ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి తీర్పు వినలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్దే వ్యాఖ్యానించారంటే రాకేష్ కుమార్ కు అంతకన్నా అవమానం మరొకటి లేదు.  అంతటితో ఆగినా బాగుండేది.  అసలు ఇలాంటి తీర్పులు ఎలా వస్తున్నాయంటూ సుప్రీమ్ చేసిన వ్యాఖ్యలు రాకేష్ కుమార్ కు అభిశంసన అని చెప్పాలి.    జస్టిస్ రాకేష్ కుమార్ ధర్మాసనం చేపట్టిన అన్ని ప్రొసీడింగ్స్ పై సుప్రీమ్ కోర్ట్ స్టే విధించింది.  ఏ రకంగా చూసినా ఇది రాకేష్ కుమార్ తన కెరీర్ చరమాంకంలో మూటగట్టుకున్న అప్రతిష్ఠగానే భావించాలి.    
 
సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు రాష్ట్ర హైకోర్టు పట్ల ఆగ్రహం అని చెప్పాలి.  గత ఏడాదిగా రాష్ట్ర హైకోర్టు అనేక వింత వింత తీర్పులు ఇస్తూ ప్రజాప్రభుత్వం పట్ల తన అక్కసును ప్రతిరోజూ కక్కుతున్నది.  ఈ సందర్భంలో గత ఏడాదిగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన అన్ని తీర్పులను సుప్రీంకోర్టు మళ్ళీ సమీక్షించాలి.  అంతేకాదు…ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన హైకోర్టును సంపూర్ణంగా ప్రక్షాళన చెయ్యాలి.  
 
తప్పుడు తీర్పులు ఇచ్చే అధర్మమూర్తులకు గుణపాఠం చెప్పే విధంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్రంలో న్యాయదేవత మానాన్ని రక్షించాలి.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు