బాబూ అశోకా.. ఈ ‘పచ్చ’ నీతులకు కాలం చెల్లిందయ్యా.!

The attitude of union leaders has not changed

అశోక్‌బాబు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘ఆరడుగుల బుల్లెట్’గా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. అప్పటికి ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు. అయితే, తెలుగుదేశం పార్టీ నేత తరహాలో.. చంద్రబాబుకి బాకా ఊదిన అశోక్‌బాబు, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏం సాధించారో అందరం చూశాం. ప్రత్యేక హోదా కోసం కూడా చంద్రబాబు కనుసన్నల్లో నానా యాగీ చేసి.. ఆ ఉద్యమాన్ని కూడా భ్రష్టు పట్టించేశారు. చంద్రబాబు కోసం ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడిగా చేసిన సేవల నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకాశం కూడా దక్కించుకున్నారు. నిజానికి, ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగులు వేరు కాదు. ఉద్యోగుల నుంచే ఉద్యోగ సంఘాల నేతలు పుట్టుకొస్తారు. దురదృష్టమేంటంటే, ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనివారు, రాజకీయ పార్టీలకు చెంచాగిరీ చేసేవాళ్ళు మాత్రమే ఉద్యోగ సంఘాల నేతలవుతున్నారిప్పడు.

The attitude of union leaders has not changed

అప్పడు చంద్రబాబు, ఇప్పడు వైఎస్ జగన్.. జమానా మారిందిగానీ.. ఉద్యోగ సంగాల నేతల తీరు మారలేదు. అప్పట్లో తానేదో చాలా చిత్తశుద్ధితో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేసేసినట్లు, ఇప్పటి ఉద్యోగ సంఘాల నేతలపై విరుచుకుపడిపోతున్నారు ఎమ్మెల్సీగా మారిన ఒకప్పటి ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన తయారైంది పరిస్థితి. ఒక్క తేడా అయితే వుంది.. ఒకప్పటికి, ఇప్పటికి. ఉద్యోగ సంఘాల నేతలు గతంతో పోల్చితే, ఇంకో రెండు మెట్లు తమ స్థాయిని దిగజార్చేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానం అందుకే మొట్టకాయలేసింది.. ఉద్యోగ సంఘాల నాయకులకి. గూబ గుయ్యిమన్నా కొందరు ఉద్యోగ సంఘాల నేతల తీరు మారడంలేదు. ఈ తీరు ప్రభుత్వంలో వున్నవారికి కూడా సమస్యగా మారుతోంది. అంతే మరి.. వాళ్ళకి రాజకీయాలు నూరి పోస్తున్న రాజకీయ పార్టీలకు తగిన శాస్తి జరగాల్సిందే కదా.. అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.