తెలుగుదేశంపార్టీ ఎంపిలు ఓవర్ యాక్షన్ బాగానే చేస్తున్నారు. నాలుగున్నరేళ్ళ పాటు కేంద్రంలోని ఎన్డీఏతో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన టిడిపి ఎన్నికల ముందు ప్రత్యేక రైల్వేజోన్ అంశంపై ఓవర్ చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంట, ఈరోజు విజయవాడలో ఎంపిలతో రైల్వేజోన్ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వినోద్ కుమార్ మీటింగ్ పెట్టారు. మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే ఏపిలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, వేగం పెంచటం తదితరాలపై చర్చించటమే.
కానీ సమావేశానికి హాజరైన ఎంపిలు మాత్రం ప్రత్యేక రైల్వేజోన్ అంశంపై చర్చకు పట్టుపట్టారు. నాలుగున్నరేళ్ళుగా రైల్వేజోన్ ప్రకటించకుండా కేంద్రం మోసం చేసందిన, ప్రాజెక్టుల్లో పురోగతి లేదంటూ మేనేజర్ పై మండిపడ్డారు. సమావేశంలో ఎంపిలు మాట్లాడిన విధానం చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడితోనో లేకపోతే కేంద్ర రైల్వే శాఖ మంత్రి వివేక్ గోయెల్ వద్దో ప్రస్తావించాల్సిన అంశాలను మేనేజర్ వద్ద మాట్లడటమేటో అర్ధం కావటం లేదు.
భారతీయ రైల్వేశాఖలో విజయవాడలో ఉండే మేనేజర్ స్ధాయి ఎంత ? ప‌్రత్యేక రైల్వేజోన్ ఇవ్వటానికి లేదా ఇవ్వకపోవటానికి మేనేజర్ కు ఏమన్నా సంబంధముందా ? విభజన హామీలు అమలు చేయాలన్నా చేయకూడదన్నా పూర్తిగా రాజకీయ నిర్ణయం. అందుకు బాధ్యుడు ప్రధానమంత్రి నరేంద్రమోడియే అన్న విషయం ఎంపిలకు తెలీదా ?
నాలుగున్నరేళ్ళ పాటు బిజెపితో అంటకాగిన చంద్రబాబునాయుడు చేతకాని తనం వల్లే రాష్ట్రం అన్నీ విధాలుగా దెబ్బతింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎన్నికలు వస్తున్నాయన్న ఏకైక కారణంతో రైల్వే మేనేజర్ పై మండిపడితే ఏమొస్తుంది ? రైల్వే కార్యాలయం ముందు ధర్నా చేస్తే ఏమవుతుంది ? కాసేపు మీడియాలో హడావుడి తప్ప .
ఇది కూడా చదవండి, వినండి