Mission Impossible trailer : తాప్సీ ‘మిషాన్ ఇంపాసిబుల్’ ట్రైలర్ వచ్చేసింది!

Mission Impossible trailer : తాప్సీ కొత్త మూవీ ట్రైలర్ వచ్చేసింది…’మిషాన్ ఇంపాసిబుల్ టైటిల్ తో ఈ సారి క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల ముందు కొస్తోంది. తను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటిస్తోంది.

ముగ్గురు బాల నటుల చుట్టూ ఈ థ్రిల్లర్ వుండబోతోంది.

‘అరెస్ట్‌.. ఇన్‌ఫ్లుయెన్స్‌.. బెయిల్‌.. ఈ సైకిల్‌ బాగా అలవాటు వీడికి’ అంటూ తాప్సీ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. టాప్సీ చేయి ఫ్రాక్చర్ అయి, బ్యాండేజీతో వుంటుంది. మాఫియా దావూద్ ఇబ్రాహీం ని పట్టుకుంటే 50 లక్షలిస్తారన్న ప్రకటనతో రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు 15 ఏళ్ల పిల్లలు దావూద్ ని పట్టుకోవడానికి బయల్దేరడం కథ. వాళ్ళ అమాయకత్వం,సాహసం అపాయంలోకి దారితీసి, క్రిమినల్స్ చిక్కి ఏమయ్యారన్నది ట్రైలర్ లో వున్న సస్పెన్స్. వీళ్లతో తాప్సీకి సంబంధం ఏమిటనేది కూడా మూవీ చూస్తేనే తెలుస్తుంది.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తీసిన స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో మహేశ్ బాబు విడుదల చేసి, యూనిట్‌ ని అభినందించారు.

తిరుపతికి సమీపంలోని ఒక మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథ ఒక బౌంటీ హంటింగ్ (నేరస్థుల్ని చట్టానికి పట్టించే) మూవీగా రూపొందింది. నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, N M పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా, సంగీతం: మార్క్ కె రాబిన్. 2017 లో ‘ఆనందోబ్రహ్మ’ తర్వాత తెలుగులో టాప్సీ నటించిన మూవీ ఇదే.

Mishan Impossible Trailer | Taapsee Pannu | Swaroop RSJ | Matinee Entertainment | Mark K Robin