డంకీతో షారూఖ్‌ హ్యాట్రిక్‌ సాధిస్తాడా..?

ఈ ఏడాది మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌. పఠాన్‌, ‘జవాన్‌’ సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకున్నాడు. జనవరిలో వచ్చిన పఠాన్‌ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. రీసెంట్‌గా విడుదలైన ‘జవాన్‌’ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.1140 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్‌ తాజాగా నటిస్తున్న మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ‘డంకీ’. మున్నాభాయ్‌ ఎం.బీ.బీ.ఎస్‌. లాగేరహో మున్నాభాయ్‌, త్రీ ఇడియట్స్‌ (3), పీకే, సంజు వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల తీసిన రాజ్‌కుమార్‌ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ కథనాయికగా నటిస్తుంది. డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదల కానుండగా.. మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క అప్‌డేట్‌ రాకపోవడం విశేషం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు బోమన్‌ ఇరానీ స్పందించాడు. దసరా పండుగా సందర్భంగా సినీ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ముంబైలోని తమ కొత్త ఆఫీస్‌ను మంగళవారం ఘనంగా ప్రారంభించింది. ఇక ఈ వేడుకలో బోమన్‌ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. వేడుక అనంతరం షారూఖ్‌ ఖాన్‌ డంకీ సినిమా గురించి మాట్లాడుతూ షారుఖ్‌కి ఇది వరుసగా మూడో బ్లక్‌ బస్టర్‌ (హ్యాట్రిక్‌) అవుతుందని అన్నారు.

అలాగే డంకీ కామెడీతో పాటు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీరు దీన్ని ఎంజాయ్‌ చేస్తారు.. అంటూ బోమన్‌ తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీపావళి కానుకగా షారుఖ్‌ డంకీ సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. దీపావళికి విడుదల కానున్న సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ జిందా హై 3 (టైగర్‌ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అటు షారుఖ్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సల్మాన్‌ ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పుకోవాలి. కాగా దీనిపై అధికారిక సమాచారం కోసం మరింత సమయం వేచి చూడాల్సి ఉంది.