సెల్ఫీ అడిగితే నెట్టేసిన సూపర్ స్టార్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డింకూ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో షారుఖ్ కి జోడీగా తాప్సి నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం షారుఖ్ ఖాన్ శ్రీనగర్ వెళ్ళారు. ఇక ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి వస్తూ అభిమానుకి అభివాదం చేస్తూ ఉన్నారు.

అయితే అదే సమయంలో అనుకోకుండా సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని షారుఖ్ ఖాన్ దగ్గరకి వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే వెంటనే షారుఖ్ ఖాన్ ఆ అభిమానిని చేతితో నెట్టేశారు. దీనికి సంబందించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇలా అభిమానిని వెనక్కి నేట్టేయడంతో షారుఖ్ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానితో సెల్ఫీ దిగడానికి షారుఖ్ కి వచ్చిన ఇబ్బందేంటి అని కొందరు కామెంట్స్ చేస్తూ ఉండగా, మరికొందరు మాత్రం అతనికి మద్దతుగా నిలబడ్డారు. షారుఖ్ ఖాన్ ని నార్త్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలాంటి ఇబ్బంది సౌత్ లో పవన్, జూనియర్ ఎన్టీఆర్ లకి కూడా చాలా సందర్భాలలో ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ ని అయితే కొంత మంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో క్రింద పడేసే ప్రయత్నం చేశారు. అయితే ఫ్యాన్స్ ఏ స్థాయిలో శృతి మించిన కూడా తెలుగు స్టార్స్ మాత్రం వారిని పక్కకి నెట్టడం చేయరు. అయితే బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఫ్యాన్స్ ని దగ్గరకి పెద్దగా రానివ్వరు. వారికున్న సెక్యూరిటీ ఫ్రాబ్లమ్ కూడా దిరికి కారణం అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ ఏడాది పఠాన్ మూవీతో వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లో షారుఖ్ ఖాన్ చేరిపోయారు. దీంతో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తన సత్తాని బాద్ షా చూపించినట్లు అయ్యింది. ఇక అత్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు రాజ్ కుమార్ హిరానీతో డుంకీ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ కానుంది.