Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన తాప్సి పూర్తిగా తెలుగు తెరకు దూరం అయ్యి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే చాలా కాలం తర్వాత మిషన్ ఇస్తాంబుల్ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ విధంగా వరుస బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి తాప్సి ఎంతో ఫీట్ గా, స్ట్రాంగ్ గా ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి అనే విషయానికి వస్తే…
మన శరీరం ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాల్సిన పని అవసరం లేదు.ముఖ్యంగా తాను ప్రతి రోజు ఎక్సర్సైజ్ చేయనని ఎక్సర్ సైజ్ బదులు ఏదో ఒక విధంగా శారీరక శ్రమ చేస్తూ ఉంటానని, తప్పనిసరి పరిస్థితులలో తప్ప తాను ఎక్కువగా కృత్రిమ వ్యాయామాలు చెయ్యనని అదే తన ఫిట్నెస్ సీక్రెట్ అంటూ తాప్సీ తన ఫిట్నెస్ సీక్రెట్స్ బయట పెట్టారు.
అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం వరకు తను తన బాడీ పై ఏమాత్రం దృష్టి పెట్టని తాప్సి ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు తమ ఫిట్నెస్ కోసం కష్ట పడటం చూసి తను కూడాతన బాడీ పై దృష్టి పెట్టానని తెలియజేశారు అయితే తాను ఏ పని చేసినా అది సహజ సిద్ధంగా ఉండాలనే ఆలోచనతో ఈమె ఎక్కువగా శారీరక శ్రమ చేస్తూ తన ఫిట్నెస్ కాపాడుకుంటున్నానని తెలియజేశారు.