తెలంగాణ రాజకీయాల్లో షర్మిల జోరు మామూలుగా లేదుగా.!

Sharmila's outburst in Telangana politics is not normal

ఓ మహిళ తెలంగాణ రాజకీయాల్లో సాధించేందేముంది.? కొత్త పార్టీ పెట్టడం, దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం సాధ్యమయ్యే పని కాదు.. పైగా, తెలంగాణలో కేసీఆర్‌ని ఢీకొనడం అసాధ్యం.. అంటూ ఓ పక్క బలమైన అభిప్రాయాలు వినిపిస్తున్నా, కాంగ్రెస్ సహా బీజేపీ ఇతర రాజకీయ పార్టీల నుంచి వెటకారాలు ఎదురవుతున్నా, వైఎస్ షర్మిల మాత్రం, తన పని తాను చేసుకుపోతున్నారు. తెలంగాణ రాజకీయాలపై బలమైన ముద్ర వేయాలనుకుంటున్నారామె. అదికారమే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. క్రమక్రమంగా షర్మిలకు పొలిటికల్ కవరేజ్ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇంకా ఆమె కొత్త రాజకీయ పార్టీ విషయమై అభిప్రాయ సేకరణలోనే వున్నారు. యుతను కదిలిస్తున్నారు.. వైఎస్సార్ అభిమానుల్ని ఆకర్షిస్తున్నారు.. వెరసి, క్రమక్రమంగా తన బలాన్ని చాటుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా జమిలి ఎన్నికలు వస్తాయా.? లేదా.? అన్నది ఇంకో చర్చ. కానీ, తెలంగాణ రాజకీయాల్లో మాత్రం అప్పుడే షర్మిల హాట్ టాపిక్ అయిపోయారు. షర్మిల పార్టీ తెలంగాణలో ఎవరికి షాక్ ఇవ్వబోతుంది.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగానే జరుగుతోంది. అన్నతో విభేదించానంటూ జగన్ పేరుని డైరెక్టుగానే ప్రస్తావిస్తున్నారు షర్మిల.

Sharmila's outburst in Telangana politics is not normal

తద్వారా తెలంగాణలో ఆమె సింపతీని పొందే అవకాశం వుంది. అది బాగానే వర్కవుట్ అవుతుంది కూడా. అలాగని తెలంగాణలో వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినదించే పరిస్థితి వుండదు. ఎందుకంటే, తెరవెనుకాల షర్మిలకు సంపూర్ణ సహాయ సహకారాలు వైఎస్ జగన్ అందిస్తూనే వుంటారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. అతి త్వరలో షర్మిల కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్న దరిమిలా, వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులు.. మరీ ముఖ్యంగా ఓ బలమైన సామాజిక వర్గానికి చెందినవారు.. అలాగే ‘ఓ మతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారు’ షర్మిల వెంట నడిచేందుకు అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ‘నా రాజకీయ ప్రయాణంలో నా భర్త అనిల్ అండగా వుంటారు..’ అని షర్మిల పనిగట్టుకుని మరీ ‘బ్రదర్ అనిల్’ పేరుని వీలైనంత ఎక్కువగా ప్రస్తావిస్తుండడం గమనార్హం. ప్రత్యేకించి ‘ఆ ఓటు బ్యాంకు’ మీదనే షర్మిల బేస్ అయి, కొత్త రాజకీయ పార్టీని ప్లాన్ చేస్తున్నారని భావించొచ్చు.