యువ నటికి ఆ పాఠాలు చెబుతున్న సీనియర్ హీరో.!

ఆమె వయసు సినిమాల పరంగా చూసుకుంటే ‘రెండు సినిమాలు’ మాత్రమే.! కానీ, చేతిలో బోల్డన్ని సినిమాలున్నాయ్. సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా ఛాన్సులొస్తున్నాయ్. ఈ మధ్యనే తన వయసు కంటే చాలా పెద్దవాడైన ఓ సీనియర్ హీరోతో సినిమా చేసి హిట్టు కొట్టింది.

ఈ ఎన్నారై భామ, తొలుత పొరుగు లాంగ్వేజ్‌లో సినిమాలు చేసి, టాలీవుడ్‌కి వచ్చింది. ఈ మధ్యనే హిట్టు కొట్టింది కదా.. రెమ్యునరేషన్ పెంచెయ్.. అంటూ పలువురు ఉచిత సలహాలు ఇస్తున్నారట. ఆ లిస్టులో సదరు సీనియర్ హీరో కూడా వున్నాడట.

దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆ సీనియర్ హీరో ఎంత మొత్తుకుంటున్నా, అందుకు ససేమిరా అంటోందిట ఈ కుర్ర హీరోయిన్. అయినా, ఆమె రెమ్యునరేషన్ గురించి ఈయనెందుకు తెగ ఇదయిపోతున్నట్టు.? ఈ డౌట్ ఓ నిర్మాతకి వచ్చింది. సదరు సీనియర్ హీరో మీద ఆ నిర్మాత గుస్సా అవుతున్నాడట. ఆ నిర్మాత తదుపరి సినిమాలో ఈ యంగ్ హీరోయిన్ నటించబోతోంది. అద్గదీ అసలు సంగతి.