ఈ వార్త చదివాక… జగన్ ను ఇంకెవరూ విమర్శించరు!

నాయకుడైన వాడికి విజన్ ఉండాలి.. విజన్ మాత్రమే ఉంటే సరిపోదు.. కార్యదక్షత ఉండాలి. సామాన్యుల సమస్యలను ఏరియల్ వ్యూలో కాకుండా.. నేరుగా చూడగలగాలి. సమస్యలను అర్ధం చేసుకోగలగాలి… వాటిని పక్కాగా పరిష్కరించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. సామాన్యుడి హృదయాన్ని తాకేలా ఆలోచించగలగాలి.

ఇందులో భాగంగానే గ్రామ వాలంటీర్ వ్యవస్థను స్టార్ట్ చేసిన జగన్… వృద్ధులకు ఇంటివద్దకే పెన్షన్ తీసుకెళ్లి గుమ్మలో ఇచ్చేలా ప్లాన్ చేశారు. దీనిపై కూడా విమర్శలు చేశారు ప్రతిపక్ష నాయకులు. ఆమాత్రం పెన్షన్ వాళ్లు తీసుకోలేరా? ఉదయాన్నే ఇళ్లకు వెళ్లి డిస్టర్బ్ చేస్తున్నారంటూ అర్థంలేని విమర్శలు చేశారు. అయితే… తాజాగా జరిగిన ఒక సంఘటనను గమనిస్తే… ఇక ఆ విషయంలో మనసున్నవారెవరూ జగన్ పై విమర్శలు చేయకపోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు!

గత పాతికేళ్లుగా ఎప్పుడూ ఒకటే మాట వినిపిసుంటుంది… “భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం” అని! మరి ఎప్పటికి అభివృద్ధి చెందుతాదో తెలియదు కానీ… అప్పటికీ ఇప్పటికీ “చెందుతూ…” ఉన్న దేశమే. కానీ కొన్ని సంఘటనలు చూస్తే… “చెందుతూ” ఉన్న దేశం కాదు… కొన్ని విషయాల్లో “వెనుకబడిన” దేశం.. అని కూడా చెప్పినా తప్పులేదనిపిస్తుంటుంది. తాజాగా ఆ వాదనకు బలం చేకూర్చే సంఘటన ఒడిశాలోని నబ్రంగ్‌ పూర్ జిల్లా, ఝరిగావ్ బ్లాక్‌ లో జరిగింది.

అవును… డెబ్భై ఏళ్ల వయసున్న సూర్య హరిజన్ అనే ఓ వృద్ధురాలు ఫించన్ కోసం మంటుటెండలో, కుర్చీ సాయంతో, కాళ్ల్కు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లింది. ఈ హృదయవిదారకమైన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పరిస్థితికి తగ్గట్లు… ఆమె బొటనవేలు రికార్డులకు సరిపోలడం లేదని అధికారులు చెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత బ్యాంకు అధికారులు ఆ సమస్యను పరిష్కరించారు!

దీంతో… ఫించన్ కోసం కిలోమీటర్ల మేర వృద్ధురాలు కాలినడకన వెళ్లడంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా.. వృద్ధులకు ఫించన్ ఇంటివద్దనే ఇచ్చే ఆలోచన చేయడం ఈ సమయంలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలు ఎన్నో ఉంటాయనే.. నాడు జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని.. ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు ఫించన్ ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారని అంటున్నారు నెటిజన్లు!